ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఏ సినిమా కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ స్టంట్ అసిస్టెంట్ కాలు విరిచేస్తున్నాడు?
2. కాజల్ కోసం ఊహలకు.. ఊసులకు అడుగులు నేర్పిన పాటల రచయిత ఎవరు?
3. 2007లో చందమామ? సరిగ్గా పదేళ్లకు 2017లో నక్షత్రం? దర్శకుడు?
4. 2007లో అటు బన్నీ, ఇటు జూ.ఎన్టీఆర్‌తో కామియో అప్పీరెన్స్‌గా ఆడిపాడిన తార?
5. గోపాల గోపాల చిత్రంలో వెంకటేష్ పాత్ర పేరు? ప్రఖ్యాత నటుడిలో రావు మిస్సైంది..
6. జోలాజో లమ్మ జోలా/ జేజేలా జోలా.. సూత్రధారుల సినిమాకు బాణీకట్టిన సంగీత దర్శకుడు?
7. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. చిత్రానికి అద్భుత సంభాషణలు ఇచ్చిన రచయిత?
8. తెలుగు సినిమా కెరీర్ అలా మొదలైంది అని చెప్పే కన్నడ భామ?
9. భక్తప్రహ్లాద చిత్రంలో ‘మహతి’ని వాయించిన ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు?
10. పక్క చిత్రంలో నటి ఎవరు?
*
సమాధానాలు- 97
*
1. వన్ (నేనొక్కడినే)
2. దాశరధి
3. హరి
4. రాజ్-కోటి
5. సి.నారాయణ రెడ్డి
6. తునే మేరీ కసమ్
7. త్రివిక్రమ్ శ్రీనివాస్
8. స్వర్ణ కమలం
9. ఇంద్రగంటి మోహన కృష్ణ
10. రేష్మి మీనన్
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
ఎస్‌వి నాగరాజు, విశాఖ
బి. ప్రసూన, తాడేపల్లిగూడెం
ఎల్‌కె గోపీనాథ్, కర్నూలు
సత్యనారాయణ, సికింద్రాబాద్
జి మల్లికార్జున రావు, పొదిలి
కె అనంతలక్ష్మి, తుని
వి శ్రీబాబు, నర్సాపురం
ఎఎల్ వెంకట్, సికింద్రాబాద్
జి గురుమూర్తి, సామర్లకోట
ప్రశాంత్ పీవీ, కాకినాడ
టి జగన్నాథ్‌శర్మ, భీమిలి
పల్ల కుమార్, పెనుగొండ
హరినాథరావు, కందుకూరు
బళ్ల పల్లవి, పిఠాపురం
కపిల శ్రీనివాస్, రాజమండ్రి
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్