జాతీయ వార్తలు

ఢిల్లీలో గ్యాంగ్ వార్.. కాల్పుల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం ఉదయం 10:30 సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన భీకర కాల్పుల వల్ల ముగ్గురు మృతిచెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. టిల్లు తాజ్‌పుర్ గ్యాంగ్‌తో పాటు జితేందర్ హోగీ గ్యాంగ్‌లు ఈ గొడవకు దిగాయి. శాంత్ నగర్‌లో ఉన్న మార్కెట్‌లో ఆ రెండు గ్రూపులు పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో పాటు.. స్థానికులపైనా విచక్షణా రహితంగా బుల్లెట్లు కురిపించారు. టిల్లు తాజ్‌పుర్ గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఓ ఎస్‌యూవీ కారుపై గుర్తు తెలియని కొందరు నిర్ధాక్షిణ్యంగా ఫైరింగ్ జరిపారని, బుల్లెట్లు డ్రైవర్‌కు తగిలాయని, ఆ తర్వాత వాహనం వెళ్లి డివైర్‌ను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ హాస్పటల్‌కు గాయపడ్డవారిని తరలించారు.