అంతర్జాతీయం

అమెరికాలో పోలీసులపై మళ్లీ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: అమెరికాలో పోలీసులపై మరోసారి కాల్పులు జరిగాయి. ఈసారి న్యూయార్క్ నగరంలో మంగళవారం ఇద్దరు పోలీసు అధికారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే, ఈ సంఘటనలో వారు సురక్షితంగా బయటపడడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. న్యూయార్క్‌లో ఇద్దరు పోలీసు అధికారులు నడిచి వెళుతుండగా కారులో వెళుతున్న నలుగురు వ్యక్తులు వారిపై ఆకస్మికంగా కాల్పులు జరిపారు. వెంటనే వారు కారును వదిలేసి పరారయ్యారు. ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొద్దిరోజుల క్రితం లూసియానాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే.