అంతర్జాతీయం

అమెరికా నైట్‌ క్లబ్‌లో కాల్పులు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్‌ మైర్స్‌లో ఓ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. 17 మంది గాయాలపాలయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. క్లబ్‌ బ్లూలో ‘టీన్‌ నైట్‌’ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. తుపాకీ చేతబూనిన ఓ వ్యక్తి క్లబ్‌లోకి ప్రవేశించిన వెంటనే జనం పైకి కాల్పులు జరపడం ప్రారంభించాడు. క్లబ్‌ పరిసరాల్లో మొత్తం మూడు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకరే అన్ని చోట్లా కాల్పులకు పాల్పడ్డారా ? లేక ఎక్కువ మంది దుండగులు ఉన్నారా? అనేది ఇంకా నిర్ధారించలేదు.