చిత్తూరు

చేపల మార్కెట్‌ను తలపిస్తున్న చట్టసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 22: ప్రజాస్వామ్య వ్యవస్థకు చట్టాలను రూపొందించే పార్లమెంట్, అసెంబ్లీలు అధికార, ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరుతో చాపల మార్కెట్‌లా తయారయ్యాయని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన తనదైన శైలిలో సంచల వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీలు అంటే ప్రజాసంక్షేమం కోసం అవసరమైన చట్టాలు చెయ్యడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నిర్దేశించినవన్నది అక్షరసత్యం అన్నారు. అయితే అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రజాసంక్షేమాన్ని విస్మరించి వారి మనుగడను చాటుకోవడానికి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో చట్టసభలు చాపలమార్కెట్‌గా తయారయ్యాయని విమర్శించారు. చాపలమార్కెట్, బస్టాండ్‌లే కాకుండా చివరకు వేశ్యాగృహాల్లో కూడా కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయేమోగాని చట్టసభల్లో ఏమాత్రం ప్రజాప్రతినిధులు నియమ, నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు కనబడుటలేదన్నారు. బాక్సైట్ తవ్వకాల్లో సిఎం చంద్రబాబునాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ప్రాణం పొయ్యినా బాక్సైట్ తవ్వకాలను ఆనుమతించబోమని ప్రతిజ్ఞ చేశారన్నారు. అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలను చేపట్టి తీరుతాం అంటూ సిఎం ప్రకటణలు చెయ్యడం ఆయన అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతున్నాయని ఆరోపించారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ తన తండ్రి వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా జివో చెయ్యడాన్ని తప్పుపట్టలేదన్నారు. అయితే నేడు బాక్సైట్ తవ్వకాలు అడ్డుకుంటామని, పోరాడుతామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఓక విధంగా చెప్పాలంటే ఎపిలో టిడిపి, వైసిపిలు మ్యూజికల్ చైర్ ఆడుతున్నాయని ఏద్దేవా చేశారు. ఇక మాఫియాను అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షికి ప్రభుత్వం నైతిక మద్దతును ఇవ్వకుండా 26కేసులు ఉన్న టిడిపి ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించడం వీరి అవినీతి పాలనకు అద్దం పడుతోందన్నారు. ఈపరిస్థితులు చూస్తుంటే ఇసుక, మద్యం, విద్య, కాల్‌మని, సెక్స్‌రాకెట్‌ల మాఫియాలకు చంద్రబాబునాయుడు అండగా నిలుస్తున్నారని తేటతెల్లం అవుతోందన్నారు. పక్కమండలానికి వెళ్లి నిజాయతీగా పనిచేసిన తహశీల్దార్ వనజాక్షి తప్పుచేసిందనంటూ సిఎం వ్యాఖ్యానించారని అన్నారు. నాడు ఆల్మట్టిడ్యాంపై పొరుగురాష్ట్రం అయిన మహరాష్టక్రు వెళ్లి పోరాడటం తప్పేనని చంద్రబాబు ఒప్పుకుంటారా ప్రశ్నించారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యే రోజా సిఎం చంద్రబాబునాయుడుని అసభ్య పదజాలంతో దూషించడం వాస్తవమైనప్పుడు ఆఘటనను మీడియా ద్వారా ప్రజలకు తెలియజెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. తద్వార ప్రజలలో చైతన్యం ఏర్పడి అలాంటి నాయకులను తిరిగి ఎన్నుకోకుండా అప్రమత్తం అవుతారని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కూడ తన ఎమ్మెల్యేలను అదుపులో పెట్టకోవాలని హితవు పలికారు. ధిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఘోరఓటమి చెందిన బిజెపి నిరాశ, నిసృహాల్లో కొట్టిమిట్టాడుతోందని అన్నారు. ఈతరుణంలో గుజరాత్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 20జిల్లాల్లో ఓటమి చవిచూడాల్సి రావడం బిజెపికి మింగుడు పడని అంశం అన్నారు. తమకు అనుకూలమైన కార్పొరేట్ బిల్లులు మాత్రం అతి కష్టం మీద పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుంటున్న ప్రధాని 33శాతం మహిళా రిజర్వేషన్‌ల జోలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. హెరాల్డ్‌కేసులో తమపై ఉన్న అవినీతి ఆరోపణనలు వాస్తవం కాదని నిరూపించుకోలేని సోనియా, రాహుల్‌లు పార్లమెంట్‌లో అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వామపక్షాలన్నీ సమన్వయంతో ఏకతాటిపైకి వచ్చి పోరాటం సాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 26న దేశవ్యాప్తంగా సిపిఐ 90వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. అలాగే జనవరి 8నుండి మూడు రోజులపాటు గుంటూరు జిల్లాలో సిపిఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు నారాయణ తెలిపారు. ఈసమావేశంలో జిల్లా కార్యదర్శి ఏ. రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్. వెంకయ్య, చిన్నం పెంచులయ్య,పి. మురళి, ఆర్. హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.