శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పదరాగిణికి ఐదు వసంతాలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* గేయధార సృష్టికర్త డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర వెల్లడి
వెంకటగిరి, డిసెంబర్ 11: ప్రాచీన గేయాలను సేకరించి వాటికి ధ్వనిముద్రణ చేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన పదరాగిణి ట్రస్టు నేటికి ఐదు వసంతాలు పూర్తి చేసుకుందని పదరాగిణి ట్రస్టు అధ్యక్షులు, గేయధార సృష్టికర్త డాక్టర్ సాయికృష్ణయాచేంద్ర వెల్లడించారు. పదరాగిణికి ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పట్టణంలోని ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సాయికృష్ణయాచేంద్ర మాట్లాడుతూ ప్రాచీన గేయాల సేకరణ పూర్తి కాలేదని, ఈ అనే్వషణ కొనసాగుతూనే ఉంటుందన్నారు. అన్నమయ్య పదాల సేకరణలో చలవ వెంకటేశ్వర పదాల పేరుతో 30 కీర్తనలు సేకరించినట్లు చెప్పారు. ఈ కీర్తనలు దేవనాగిరి లిపిలో, ప్రాచీన తాళపత్రాల్లో ఉన్నట్లు చెప్పారు. వీటిని 2016లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. అన్నమయ్య పుత్రుడు పెద తిరుమాలాచార్యులు రచించిన శ్రీ వెంకటేశ్వర ప్రభాతస్తవమును మొదటిసారిగా ధ్వనిముద్రణ రూపంలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ధ్వనిముద్రణకే పరిమితమైన పదరాగిణిని ప్రస్తుత పుస్తక రూపంలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పదరాగిణి ప్రథమ ముద్రణగా అన్నమయ్య అమోఘ పదరాగిణి చేసినట్లు చెప్పారు. రెండవదిగా ఆచార్య కెజె కృష్ణమూర్తి సంపాదకర్తంలో సుత్రభాత స్తవం చేస్తున్నట్లు చెప్పారు. మూడవ ప్రచురణగా చలువ వెంకటేశ్వర పదాలు 30 కీర్తనలు సేకరించామని, వాటిని కూడా ప్రచురణ చేస్తున్నట్లు చెప్పారు. పుస్తకాలు అందరికీ ఉచితంగా అందే విధంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వజ్ఞకుమార యాచేంద్ర, ట్రస్టు సభ్యులు రాఘవయ్య, నర్రా మీనయ్య తదితరులు పాల్గొన్నారు.

అమ్మ తిట్టిందని... కొడుకు ఆత్మహత్య
ఉదయగిరి, డిసెంబర్ 11: స్థానిక అరుంధతీయవాడలో శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన వినయకుమార్ (18) ఇక్కడి థమ్స్‌అప్ గోదాములో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాత్రివేళల్లో ఇంటికి సకాలంలో రావడం లేదని అతని తల్లి మందలించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు.