Others

భక్త ప్రహ్లాద (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛాయాగ్రహణం: వినె్సంట్
కళ: ఎకె శేఖర్
కూర్పు: ఆర్ విఠల్
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
నృత్యం: వెంపటి సత్యం, గోపాలకృష్ణన్, కెఎస్ రెడ్డి
సహ నిర్మాతలు- కుమరన్, మురుగన్, శరవణన్.
నిర్మాత: ఎవి మెయ్యప్పన్
***

నాటక రంగంలో సుమారు 19 ప్రహ్లాద నాటకాలు చలామణిలో ఉండేవి. వాటిలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు వ్రాసిన (ఏడొవది) నాటకాన్ని సురభి సమాజం ప్రదర్శించేవారు. ఆ నాటకం ఆధారంగా ఆ సభ్యులతో బొంబాయిలో నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రం ‘్భక్తప్రహ్లాద’. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను దక్షిణ భారత టాకీ పితామహునిగా పేరొందిన హెచ్‌ఎం రెడ్డి (హనుమప్ప మునియప్ప రెడ్డి) నిర్వర్తించారు. అంతకుముందు ఇంపీరియల్ స్టూడియో అధినేత, తొలి టాకీ సినిమా ‘ఆలం అరా’ నిర్మాత ఆర్షేషిర్ ఇరాని వద్ద హెచ్‌ఎం రెడ్డి సహాయకునిగా పనిచేయటమే కాదు, పృథ్వీకపూర్ నటించిన ‘ప్రిన్స్ విజయకుమార్’ ‘ఎవ్యాగర్ ఇన్ లవ్’ వంటి మూకీ చిత్రాలకు దర్శకత్వం నెరిపారు. ఈ చిత్రంలో మునిపల్లె సుబ్బయ్య (వల్లూరి వెంకట సుబ్బారావు) హిరణ్య కశ్యపునిగా, సురభి కమలాబాయి లీలావతిగా, సింధూరి కృష్ణారావు ప్రహ్లాదుడిగా, చిత్రపు నరసింహారావు చండామార్కులలో ఒకరైన బ్రహ్మగా, ఎల్‌వి ప్రసాద్ సహాయ దర్శకునిగా, ప్రహ్లాదుని సహాధ్యాయి మొద్దబ్బాయిగా నటించారు. సంగీతం- హెచ్‌ఆర్ పద్మనాభశాస్ర్తీ, సాహిత్యం- చందాల కేశవదాసు. భారత మూవీ టోన్ అనే శ్రీకృష్ణా ఫిలిం కంపెనీ బ్యానర్. చిత్ర నిర్మాణ బాధ్యతలకు నటులు సిఎస్‌ఆర్ ఎంతో శ్రమించారు. ఇరవై రోజుల్లో 20 వేల రూపాయలతో చిత్రం పూర్తికావటం విశేషం.
మరోసారి 1942లో శోభనాచల బ్యానర్‌పై చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో భక్త ప్రహ్లాద నిర్మించారు. రచన పసుమర్తి యజ్ఞనారాయణశాస్ర్తీ. హిరణ్య కశిపుడిగా వేమూరి గగ్గయ్య, లీలావతిగా రాజేశ్వరి, కంచి నరసింహారావు, రంగూన్ రామారావు (చండామార్కులు), నారాదుడిగా రామకృష్ణశాస్ర్తీ, 1వ ప్రహ్లాదుడిగా పరిపూర్ణ, రెండో ప్రహ్లాదుడిగా జి వరలక్ష్మి నటించారు. సంగీతం మోతీబాబు అందించారు. ఈ రెండు చిత్రాలూ విజయం సాధించాయి. మూడోసారి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవిఎం ప్రొడక్షన్స్ ఈస్ట్‌మన్ కలర్‌లో 1967లో ‘్భక్తప్రహ్లాద’ చిత్రాన్ని నిర్మించింది. 1967 జనవరి 12న చిత్రం విడుదలైంది.
చిత్రం ఏమిటంటే -1942లో భక్త ప్రహ్లాదకు దర్శకత్వ సారథ్యం వహించిన చిత్రపు నారాయణమూర్తే, పాతికేళ్ల తరువాత వచ్చిన భక్త ప్రహ్లాదకూ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. మరో విశేషం, సాంఘిక చిత్రాల రచయితగా పేరొందిన డివి నరసరాజు రచించిన తొలి పౌరాణిక చిత్రమిది.
***
ద్వార పాలకులు జయ విజయులు వైకుంఠంలో విష్ణుమూర్తి (హరనాథ్) దర్శనం కోసం వచ్చిన సనకసనందనాదులను అడ్డగిస్తారు. వారి ఆగ్రహానికి గురై శాపం కారణంగా -దితి (జయంతి), కశ్యప్రజాపతి (వి శివరాయ్) దంపతుల గర్భాన పడి హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు (ఎస్‌వి రంగారావు)గా రాక్షస జన్మ ఎత్తి లోకకంటకులౌతారు. భూదేవిని బాధిస్తున్న హిరణ్యాక్షుని శ్రీహరి వధిస్తాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు చేసి రాత్రికాని, పగలుకాని, బయటకాని లోపలకాని, మనిషి, జంతువు, ఆయుధం వేటివల్లా మరణం లేకుండా వరం పొందుతాడు. ఈలోపు దేవేంద్రుడు (్ధళిపాళ) హిరణ్యకశిపుని భార్య, నిండు గర్భిణి అయిన లీలావతి (అంజలిదేవి)ని చెరపట్టి వధించబోగా, నారదుడు (బాలమురళీకృష్ణ) అడ్డుపడి ఆమెను తన ఆశ్రమంలో చేరుస్తాడు. లీలావతికి అక్కడ ప్రహ్లాదుడు జన్మిస్తాడు. హిరణ్యకశపుడు వరగర్వంతో దిక్పాలకులను హింసించి దాసులను చేసుకుంటాడు. ప్రహ్లాదునికి విద్య నేర్పటానికి చండా, మార్కులకు (రేలంగి, పద్మనాభం) అప్పగిస్తారు. ప్రహ్లాదుడు (రోజారమణి) శ్రీహరి భక్తుడై తండ్రికి మనఃక్లేశం కలిగిస్తాడు. విష్ణు భక్తి మానమని ప్రహ్లాదుని తండ్రి పలు బాధలకు, శిక్షలకు గురిచేయడం, చివరకు మహావిష్ణువు స్తంభం నుంచి వెలువడి హిరణ్యకశపుని అంతం చేయటం, ఉగ్రవ నరసింహుని ప్రహ్లాదుడు, దేవతలు శాంతింప చేయటం జరుగుతుంది.
ఈ చిత్రంలో రాజనర్తకిగా ఎల్ విజయలక్ష్మి, పాముల వాళ్లుగా రమణారెడ్డి, కనకం; రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలుగా గీతాంజలి, శాంత, విజయలలిత, వెన్నిరాడై నిర్మల, రాక్షస గురువుగా (గెస్ట్) నాగయ్య నటించారు.
ప్రతిభావంతులైన నటీనటులంతా పరిణితి చెందిన నటనతో పాత్రోచితంగా మెప్పించారు. ప్రహ్లాదునిగా బేబి రోజారమణి (సినిమా రంగం పత్రికలో పనిచేసిన సత్యంగారి అమ్మాయి) ఐదేళ్ల వయసులో తొలిసారి చిత్ర రంగానికి పరిచయమైంది. ఈమెకు డైలాగులు నేర్పించే బాధ్యత రంగూన్ రామారావు (2వ ప్రహ్లాద చండా మార్కులలో ఒకరు) తీసుకున్నారు. ఏక సంధాగ్రాహి అయిన రోజారమణి చక్కగా లిప్ మూమెంట్ ఇచ్చి అద్భుతంగా నటించింది. ఆమె లిప్ మూమెంట్ గమనించటానికే ఈ చిత్రాన్ని రెండవసారి చూసినట్టు నటులు అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసించటం ఓ విశేషం. అంజలీదేవి, ఎస్వీఆర్ షూటింగ్ సమయంలోనే తమ అభినందనలు తెలియచేయటం మరో విశేషాంశం.
చిత్రంలోని గీతాలు వేటికవే అని చెప్పాలి. సముద్రాలవారు 5 గీతాలు రాశారు. ప్రహ్లాదునిపై గీతం -ఆదుకోవయ్యా ఓ రమేశా (పి సుశీల బృందం), -నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం (పి సుశీల బృందం), -జీవము నీవేకదా (పి సుశీల), -కనులకు వెలుగువు నీవే కాదా (పి సుశీల, ఎస్ జానకి), నారదునిపై గీతం -వరమొసగే వనమాలి (మంగళంపల్లి), -శ్రీమానినీ మందిరా (పి సుశీల, మంగళంపల్లి బృందం), అంజలిదేవి, చెలులు, నారదునితో ఊయల గీతం -సిరిసిరి లాలీ చిన్నారి రాలీ (ఎస్ జానకి, మంగళంపల్లి- రచన ఆరుద్ర) గీతాలు అద్భుతం. భాగవతంలోని పద్యాలు -పంచాబ్దంబులవాడు (మాధవపెద్ది), మందార మకరంద, -కలడు భోదిగలడుగాలి, -కంజాక్టునకుగాని కాయంబు, -ఇందుగలడందు లేడని (పి.సుశీల), అంజలిదేవిపై గీతం -జననీ వరదాయని త్రిలోచని (ఎస్ జానకి- పాలగుమ్మి), రంభ, ఊర్వశిలపై నృత్య గీతం -అందని సురసీమ (పి సుశీల, ఎస్ జానకి, శూలమంగళం రాజ్యలక్ష్మి, రచన- సముద్రాల జూనియర్), నారదునిపై గీతం -ఆది అనాదియు నీవే (మంగళంపల్లి, రచన -దాశరథి), యల్ విజయలక్ష్మిపై నృత్యగీతం -రారా ప్రియా సుందరా (పి సుశీల -దాశరథి) గీతాలు సంగీత, సాహిత్య, చిత్రీకరణపరంగా అలరించేలా సాగాయి. ముఖ్యంగా ‘జీవము నీవె కదా’ పాటలో ప్రహ్లాదునికి శిక్షలు, అవి విఫలం కావటం, ఏనుగులు ప్రహ్లాదునికి ప్రదక్షణ, హిరణ్యకశపుని పుత్ర వాత్సల్యం, సముద్రంలో ముంచిన ప్రహ్లాదుని గురించి లీలావతి, హిరణ్యకశపుల విచారం, హిరణ్యకశపుడు అంతరాత్మతో సంభాషణలు.. ఆకట్టుకునేలా చిత్రీకరించారు.
చిత్రంలో నారదునిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ అయితే బాగుంటుందన్న మెయ్యప్పన్ సతీమణి సూచననచ్చి, మెయ్యప్పన్ బాలమురళిని అంగీకరింపచేశారు. వారు నటించిన తొలి చిత్రమే భక్తప్రహ్లాద.
చాలాకాలం తెలుగు చిత్ర నిర్మాణానికి దూరంగావున్న మెయ్యప్పన్ తిరిగి ఈ చిత్రం ద్వారా కథ మీద నమ్మకంతో సాహసించి కలర్‌లో తీయటం, విజయం సాధించటం జరిగింది. ఈ చిత్రంతోపాటు ఒకేసారి ‘అవేకళ్ళు’ చిత్రాన్ని రూపొందించటం జరిగింది.
‘్భక్తప్రహ్లాద’ చిత్రాన్ని తమిళంలోకి, హిందీలోకి అనువదించారు. అక్కడా విజయం సాధించింది. బిఏఎస్ పతాకంపై నిర్మించిన చెంచులక్ష్మి (1958) చిత్రంలో సగభాగం ప్రహ్లాద చరిత్ర చిత్రీకరించటం, సగ భాగం ఉగ్రనరసింహుని శాంతించడం కాగా ఈ చిత్రంలో పూర్తిగా ప్రహ్లాదుని వృత్తాంతం వివరంగా చూపటం, చెంచులక్ష్మిలో హిరణ్యకశపునిగా నటించిన ఎస్‌విఆర్ తిరిగి అదే పాత్రలో మరింత ధీర, గంభీరతతో మెప్పించటం విశేషం. 1967 భక్తప్రహ్లాద చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతి లభించింది. రోజారమణికి జాతీయస్థాయిలో ఉత్తమ బాలనటి అవార్డు దక్కింది. ఆనాటి భారత రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రత్యేక ప్రదర్శనలో చిత్రాన్ని వీక్షించి, నటీనటులను ప్రత్యేకించి రోజారమణి, ఎస్‌వి రంగారావులను అభినందించి ప్రశంసించారు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి