Others

దేవకన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛాయాచిత్ర బేనర్‌పై నిర్మాత సుబ్బరాజు, దర్శకులు కె.ప్రత్యగాత్మ సహకారంతో వారి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మంచిమనిషి’ (1964) అదే ఛాయాచిత్ర పిక్చర్స్ బేనర్‌పై సుబ్బరాజు సోదరులు శ్రీరామరాజు, ప్రత్యగాత్మ సోదరులైన కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘దేవకన్య’(1968). 23-03-1968 విడుదల.
ఉపాధ్యాయునిగా వృత్తిని ప్రారంభించి, ప్రవృత్తిగా పాటల్నీ, పద్యాలను చందోబద్ధంగా వ్రాయటమేకాక, సినిమా రచనలో ప్రవేశించి, పలు చిత్రాలకు చక్కని పాటలను, పసందైన మాటలను, కొన్ని చిత్రాలకు కథలను సమకూర్చిన నటులు, సంగీతకారులు ప్రసిద్ధిచెందిన రచయిత వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి. ఇంటి పేరు వీటూరితో ప్రసిద్ధులు.
‘దేవకన్య’ చిత్రానికి కథ, మాటలు: వీటూరి, కూర్పు: అంకిరెడ్డి, నృత్యం: చిన్ని- సంపత్, నృత్యతారలు సరస్వతి (సచ్చు), రాజీ, రేణు, ఫొటోగ్రఫీ: యం.జి.సింగ్, యం.సి.శేఖర్, స్టంట్స్: సాంబశివరావు, పార్టీ సంగీతం: టి.వి.రాజు, నిర్మాత: బి.హెచ్.శ్రీరామరాజు, దర్శకత్వం: కె.హేమాంబరధరరావు.
అలకాపురి ప్రభువు కుబేరుడు (ప్రభాకర్‌రెడ్డి) అతని శివ పూజకు ఆటంకం కలిగించిన విద్యాధరుడు (కాంతారావు), కినె్నర (కాంచన)లను భూలోకంలో జన్మించమని, ఒక్క ఝాములో 11 శివక్షేత్రాలు దర్శిస్తే విద్యాధరునికి, ఆమె అందమే ఆమెకు శత్రువు అయిన కినె్నర దైవబలంతో కష్టాలు అధిగమిస్తారని తెలియచేస్తాడు. ఆ ప్రకారం భూలోకంలో ఇంద్రసేన మహారాజు (మిక్కిలినేని) మహరాణి (హేమలత)లకు జన్మించిన శ్రీ్ధర్, అడవిలో రాజగురువు(నాగయ్య)వద్ద పెరుగుతాడు. యుక్తవయస్కుడై తండ్రి (బోయి)ని కలియబోయి నిందకు గురవుతాడు. దారిలో కలిసిన లాలాస (కాంచన)తో కామరూపం దేశంలోని కామపాలుని (రాజనాల)వద్ద కొలువులో చేరతాడు. లాలాసపై ఆశపడ్డ కామపాలుడు, శ్రీ్ధర్‌ను తలపగలకొట్టి ఓ యక్షుడు మణికంధరుడు (్భమరాజు)వుండే చెట్టువద్ద వదలి వెళతాడు. ఆ రాత్రి ఆ చెట్టు కదిలి శివక్షేత్రాలు తిరగటం, దానితో శ్రీ్ధర్ శాపం తీరటం జరుగుతుంది. కామపాలుని నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకిన లాలాసను ఒక యోగి (త్యాగరాజు) కాపాడి, ఆపైన ఆమెను వాంఛిస్తాడు. తన కోరిక తీర్చనందుకు, ఆమెను తాకితే ఆమె భర్త వికృత రూపుడౌతాడని, ఆమెకు పుట్టిన కుమారునిచే పాపనాశనం వద్ద, పాతాళ జలంతో అతడు శాప విముక్తుడౌతాడని తెలియచేసి, తన తపస్సు భంగం అయినందుకు ప్రాణత్యాగం చేసుకుంటాడు. ఇంతలో శ్రీ్ధర్ కామపాలుడి నుంచి తండ్రిని రక్షించి, లాలాసకోసం వెదకి ఆమెవలన వికృతరూపం పొంది, ఒకరోజు ఆమెతో గడిపి వెళ్ళిపోతాడు. గర్భవతియైన లాలాస కుమారుని కని, ఆ బాలునికి 5 సం.లు వచ్చాక అతనితో పాతాళ గంగకోసం, పాపనాశనం బయలుదేరుతుంది. ఆమెకోసం వేచివున్న కామపాలుడు ఆమెను బలవంతం చేయబోగా, వికృత రూపంలోవున్న శ్రీ్ధర్ వచ్చి ఆమెను రక్షించటం, దైవబలంచే, విసిరిపడిన చెంబు పైకెగసి, గంగాజలంతో శ్రీ్ధర్ శాప విముక్తి పొందటం. అక్కడకు వచ్చిన రాజదంపతులు, కుమారుడు, కోడలు, మనవడితో రాజ్యం చేరటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో పేరమ్మగా నిర్మల, శ్రీ్ధర్ స్నేహితుడుగా బాలకృష్ణ, అతని భార్యగా రమాప్రభ, ఆమె తల్లిగా లక్ష్మీకాంతమ్మ, కామపాలుని అనుచరుడు కలికాలంగా అల్లురామలింగయ్య ఇతర పాత్రలు పోషించారు.
పౌరాణిక, జానపద అంశాలతో కూడిన కథను, దానికి తగ్గ మాటలను వీటూరి చక్కగా ఏరి కూర్చగా, దర్శకులు హేమాంబరధరరావు ఆకట్టుకునే రీతిలో పరిణితితో చిత్రీకరించారు. తొలుత కుబేరునివద్ద శాపం, దాసి మల్లిక వల్ల, రాకుమారుడి జాతకం మారటం, తండ్రివద్ద శ్రీ్ధర్ భంగపాటు, తిరిగి కామపాలుని నుంచి తండ్రిని రక్షించుకోవటం, రాజదర్శనం కోరిన వారిని సేవకులు ‘చేయి తడుపూ’ ‘మూతి ముడుపు’ ఏ విధంగా అడ్డగిస్తారో చూడటం తన లక్షణాలను తన చిత్రాల పేర్లతో కాంతారావు రాజువద్ద (ఆకాశరామన్న గురువును మించిన శిష్యుడు) వెల్లడిచేయటం, లాలాస, మదాలస వేర్వురు అని, రాజనాలకు అన్పించటం, కాంతారావు రాజనాలల, కత్తిపోరాటం, మిడతం బొట్లుగా బాలకృష్ణ మహిళలు చూపటం కామెడీతో, ఇక చెట్టుపై నుంచి, ఆకాశ మార్గాన శివక్షేత్రాల మహిమను ‘ఈశా మహేశా గిరీశా’ పాటలో ‘శ్రీతజనమందార కేదారేశ్వర’, ‘సైకత లింగ రమ్య శుభాంగా రామలింగ’, ‘శ్రీ సుందరేశ్వర మీనాక్షి మనోహర్’ అని చిదంబర నటరాజును, ‘వాయులింగ శ్రీకాళహస్తీశ్వరుని’ ‘అరుణేంద్రశేఖర్ అరుణా చలేశ్వర్’, ‘మోక్ష ద్వారము ద్రాక్షారామం’, గంగాతరంగాల కలుషాలు చాపే కాశీవిశే్వశ్వరు’ని ఇలా 11క్షేత్రాల మహిమలు, శివలింగాలను, శిల్పాలను చూపుతూ చిత్రీకరించటం (గానం- ఘంటసాల-రచన వీటూరి) వీరిదే మరో భక్తిగీతం శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తూ ‘శ్రీరమణా వేంకటరమణా కనరావయ్యా పావన శుభచరణ’ (గానం పి.సుశీల, బి.వసంత), (రచన- వీటూరి) కమనీయంగా సాగాయి. మరో రెండు యుగళ గీతాలు ఒకటి కాంతారావు, కాంచనలపై స్వర్గంలో ‘ఏదో పిలిచినది, ఏమో పలికినది విరిసే వయసే’(గానం- పి.సుశీల, ఘంటసాల- వీటూరి రచన). మరో గీతం ‘కలలన్నీ పులకించువేళ చెలి తొలి తొలి వలపులు చిలికించవేళ’(గానం- ఘంటసాల, బెంగుళూరు లత-రచన సి.నా.రె). కొసరాజు వ్రాయగా పి.సుశీల గానం చేసిన గీతాలు ‘అయ్యా పూలు కొంటారా’, మరొకటి ‘ఓ దారిన బోయే ఓ బావా’ ఈ చిత్ర గీతాలకు టి.వి.రాజు సమకూర్చిన స్వరాలతో రసరమ్యంగా అలరించాయి. ‘ఏదో పిలిచినది’ గీతం చిత్రంలో ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో పదేపదే విన్పించటం ఓ విశేషం.
చిత్రంలోని నటీనటులందరూ, తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు. కాంతారావు, అందాల నటి కాంచన జంటగా(1968లో ‘వీరపూజ’, ‘దేవకన్య’, ఆ తరువాత ‘అందంకోసం పందెం’ వచ్చాయి. నాయికా నాయకులుగా వీరిద్దరు ముచ్చటగా నటించి అలరించారు.
‘దేవకన్య’ చిత్రం చక్కని కాలక్షేప చిత్రంగా చెప్పుకోవచ్చు. సక్సెస్‌తో సంబంధం లేకుండా, ఈ చిత్రంలోని 2 భక్తిగీతాలు, యుగళ గీతం, ఈ చిత్రాన్ని ఓ చక్కని జ్ఞాపకంగా మిగల్చటం ఆనందదాయకం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి