ఆంధ్రప్రదేశ్‌

ఫ్లీట్ రివ్యూ పేరుతో వ్యాపారాలను అడ్డుతున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పేరుతో విశాఖ నగరంలో అనేక సెంటర్లలో తోపుడు బండ్లు, చిల్లర వర్తకులను వ్యాపారాలు చేయనివ్వకుండా జివిఎంసి, పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై విశాఖపట్నం తోపుడుబండ్లు, చిల్లర వర్తకుల సంఘం నిరసన తెలియజేసింది. దీనిపై కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్‌ను సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఫ్లీట్ రివ్యూ వచ్చేనెల నాల్గవ తేదీ నుండి ప్రారంభమైతే ఈ నెల 25వ తేదీ నుంచి చిల్లర వ్యాపారులను వ్యాపారలు చేయనివ్వడంలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫ్లీట్ రివ్యూ కారణంగా వ్యాపారాలు చేయడం సాధ్యపడకపోతే చిల్లర వర్తకులందరికీ మత్స్యకారులకు ఇచ్చిన విధంగానే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే కలెక్టర్ స్పందిస్తూ ఈర ఓజు ముఖ్యమంత్రి పర్యటన పూర్తయిన వెంటనే ఈ సమస్యపై జోనల్ స్థాయి అధికారులతో చర్చించి న్యాయం చేస్తామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం సిఐటియు నగర కార్యదర్శి బి.వెంకటరావు, గౌరవ అధ్యక్షులు ఎం.కృష్ణ, సిఐటియు నగర నాయకులు ఎం.సుబ్బారావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.