రాష్ట్రీయం

గుత్తి-రేణిగుంట సెక్షన్‌లో రైల్వే ట్రాక్‌పై పారుతున్న వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు 12 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే
హైదరాబాద్, నవంబర్ 21: గుంతకల్లు డివిజన్‌లోని గుత్తి-రేణిగుంట సెక్షన్‌లోని నందలూరు-మంటపంపల్లె మధ్య రైల్వే ట్రాక్‌పై నుంచి వరద నీరు ప్రవహించడంతో ఆ రూట్లో నడిచే పలు రైళ్లను ఈ నెల 22న రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. బిట్రగుంట- చెన్నై, చెన్నై-గూడూరు, తిరుపతి-గూడూరు-తిరుపతి, రేణిగుంట- గూడూరు- రేణిగుంట, కాట్పడి-తిరుపతి- కాట్పడి, సూళ్లూరుపేట-నెల్లూరు-సూళ్లూరు పేట, చెన్నై- తిరుపతి, తిరుపతి-చెన్నై, నెల్లూరు- చెన్నై-నెల్లూరు, నెల్లూరు-తిరుపతి, తిరుపతి-మూరే మార్కెట్ పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే తెలిపింది.