రాష్ట్రీయం

ఫిరాయింపులతో టిడిపి, కాంగ్రెస్ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎమ్మెల్సీ’ అభ్యర్థుల ఎంపికలో తాత్సారం మరో రెండు రోజులే గడువు

హైదరాబాద్, డిసెంబర్ 6: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీ నేతలు కొందరు ఫిరాయింపులకు పాల్పడటాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ ప్రభావం స్థానిక సంస్ధల కోటా నుంచి శాసన మండలికి జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంపై పడింది. ఏం చేయాలో పాలుపోని అగ్ర నేతలు అభ్యర్థుల ఎంపికలో తాత్సారం వహిస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజుల గడువు ఉన్నా, అభ్యర్థులను ఎంపిక చేయలేకపోతున్నారు. అభ్యర్థులను ఖరారు చేసినా, ఆ అభ్యర్థులను కూడా టిఆర్‌ఎస్ తమ వైపు తిప్పేసుకుంటుందోనన్న భయం పట్టుకున్నదని కాంగ్రెస్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు (జిహెచ్‌ఎంసి) ఎన్నికలు జరగడానికి ముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టిడిపి ఎమ్మెల్యే జి. సాయన్న టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ రెండు పార్టీల్లోనూ గుబులు ఆరంభమైంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ళ పాటు టిడిపిలో ఉన్న సాయన్న, కరడుగట్టిన కాంగ్రెస్‌వాది ఎమ్మెల్సీ ప్రభాకర్‌లాంటి వాళ్ళే బయటకు ఏ మాత్రం వాసన తగలకుండా లోలోపల మాట్లాడుకుని టిఆర్‌ఎస్‌లో చేరారని నేతలు అంటున్నారు. ఏ సమయంలో ఏ నాయకుడు మరో పార్టీ నేతతో మాట్లాడుకుంటారో తెలియడం లేదని, పార్టీ ముఖ్య నాయకులను కమ్ముకుని కూర్చోవడం సాధ్యం కాదు కదా? అని టిడిపి, టిఆర్‌ఎస్ నాయకుల చెబుతున్నారు.