సంజీవని

ఛలిలో వణికించే ‘ఫ్లూ’ జ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఫ్లూజ్వరం వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నపుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. అనగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఫ్లూజ్వరం వాతావరణంలో మార్పు, రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం, వర్షంలో తడవటం మరియు వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
కండరాల నొప్పులు, నీరసం, జ్వరం, జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఆకలి మందగించటం, వికారం, వాంతులు అవుతుంటాయి.
జాగ్రత్తలు
జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం, ముక్కు నుండి నీరు కారటం వంటి లక్షణాలు మూడు రోజులకు మించి ఉంటే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి. ఫ్లూజ్వరం సోకినవారు దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కుకు, నోటికి చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ముక్కుకి, నోటికి మాస్కు ధరించి ఉండాలి. మంచినీరు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.
నివారణ పద్ధతులు
ఆరోగ్యంగా ఉండి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి దరిచేరదు. అలాగే ఫ్లూజ్వరం నివారణకు జ్వర లక్షణాలను బట్టి సరైన మందు ఎన్నుకొని వాడుకొన్నట్లయతే వ్యాధినివారణ జరుగుతుంది.
మందులు
ఆర్సినికం ఆల్బం
ముక్కునుండి నీరు కారడం, దగ్గు, జ్వరంతోపాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, కళ్ళనుండి నీరు కారడం, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్ళు నొప్పులు, మానసిక స్థాయిలో ఆందోళన, భయం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
జెల్సీమియం
దాహం లేకపోవుట, రోగి మగతగా, నీరసంతో అలిసిపోయినట్లుగా ఉండి ముక్కు నుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరు తేలికగా ఆందోళన చెందుతారు.
యుపటోరియం పర్పోరేటం
నీరసంతో అలసిపోయినట్లుగా ఉండి ముక్కు నుండి నీరు కారడం, తలనొప్పి దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటుగా కండరాల నొప్పులు, కీళ్లనొప్పులున్నవారికి ఈ మందు ముఖ్యమైనది. పక్కలకు తిరిగి పడుకోవాలంటే ఒళ్ళు నొప్పులతో అవస్థ పడుతూ ఉంటారు.
బ్రయోనియా
ఫ్లూ లక్షణాలతోపాటు దగ్గు ఎక్కువగా ఉండి, నోరు తడి ఆరిపోయినట్లుగా ఉంటుంది. వీరిలో దాహం అధికంగా ఉండుట, కదలికలను భరించలేకపోవుట, దాహం వేసినపుడు చల్లని నీరు కావాలని కోరుకొనుట గమనించదగిన ముఖ్య లక్షణం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఈ మందులే కాకుండా ఇపికాక్, రస్‌టాక్స్, బాప్టిషియా, ఎకోనైట్, ఫెర్రంఫాస్, కాలిమోర్, వెరట్రం ఆల్బం, ఎల్లియం సెఫా వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకొని ఫ్లూ జ్వరం నుండి నివారణ పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్ 9440229646