ఫోకస్

రాజకీయ జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యంవల్లే యూనివర్శిటీల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యార్థుల్లో అసంతృప్తి, సిబ్బందిలో అభద్రతాభావం వ్యక్తమవుతోంది. దీంతో కళాశాలల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికి కారణం విద్యావ్యవస్థ స్వయంప్రతిపత్తితో ఉండకపోవడమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి వారి అభిరుచుల మేరకు విద్యవిధానాల్లో మార్పులు చేస్తున్నారు. యూనివర్శిటీల వైస్ చాన్సలర్లను ఆయా ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. దీంతో విద్యార్థుల్లో అనైక్యత చోటుచేసుకుని, రాజకీయ పార్టీలకు బాహాటంగా మద్దతు తెలిపే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుల, మత ప్రాతిపదికన విద్యావ్యవస్థలు ఉండరాదు. యూనివర్శిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికల్లో, విసిల నియామకాల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోకూడదు. విద్యావ్యవస్థలో శాస్ర్తియంగా విధానాలు కొనసాగాలి. ప్రస్తుతం యూనివర్శిటీల్లో ఇండస్ట్రియల్ టైఅప్ లేదు. నైపుణ్యత, విలువలతో కూడిన నిబంధనలు లేవు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా పాలసీలు మారుతున్నాయి. అలా జరుగకుండా యూనివర్శిటీల్లో ఇండస్ట్రియల్ టైఅప్ ఉంటే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. నైపుణ్యతను బట్టి నియామకాలు జరిగితే సిబ్బందిలో అభద్రతభావం ఉండదు. రాజకీయ జోక్యం లేకుంటే నైపుణ్యత, విలువల ఆధారంగా శాస్ర్తియ విద్యావిధానాల రూపకల్పన జరుగుతుంది. కాబట్టి విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదు.

-రాజారెడ్డి లోక్‌సత్తా, జాతీయ ఫైనాన్స్ కమిటీ చైర్మన్