ఫోకస్

వ్యవస్థలున్నా అన్నీ వైఫల్యాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారీస్ లాంటి ఉగ్రవాదుల ఘటనలను ఎదుర్కొవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పటిష్టమైన వ్యవస్థలు ఉన్నాయి. దీంటో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే అలాంటి ఘటనలను ఎదుర్కొవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఘోరమైన వైఫల్యాలను ఎదుర్కొవాల్సిన పరిస్థితులే ఏర్పడ్డాయి. ఎప్పుడైన ఉగ్రవాద చర్యలు తలెత్తిన సందర్భంలోనే కొన్ని రోజుల పాటు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఆ తర్వాత మళ్లీ యధావిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఉగ్రవాదులు మళ్లీ ఘాతకాలకు పాల్పడుతున్నారు. ఘటనలు జరిగినప్పుడు అప్రమత్తం కావడం మాత్రమే కాకుండా శాశ్వతమైన వ్యవస్థ పని చేసే విధంగా ఉండాలి. గతంలో హైదరాబాద్ నగరంలో లుంబిని పార్క్, గోకుల్ చాట్ వద్ద జరిగిన ఉగ్రవాదుల దాడుల తర్వాత కొంత కాలం పోలీసు, నిఘా వర్గాలు పటిష్టంగా పనిచేశాయి. ఆ తర్వాత మళ్లీ మునుపటి పరిస్థితులు నెలకొనడం, నిఘా వర్గాల డొల్లతనం అప్పుడప్పుడు కనిపిస్తుంది. అలా కాకుండా నిఘా వర్గాల, పోలీసుల అప్రమత్తత కేవలం ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా శాశ్వత ప్రతిపాదికన పని చేసే విధంగా ఉండాలి.

- పాండురంగారావు లోక్‌సత్తా తెలంగాణ అధ్యక్షుడు