ఫోకస్

శాంతి భద్రతలతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతి భద్రతల విషయంలో ప్రతిక్షణం ఈ ప్రభుత్వం అప్రమత్తమై ఉంది. తీవ్రవాదం, ఉగ్రవాదం, విచ్చిన్నకరవాదాలే కాదు, నక్సలిజాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నియంత్రించాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలందరి సహకారం అవసరం, ప్రతి గ్రామం అభివృద్ధి జరగాలనే ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అందుకు అనుగుణంగానే అభివృద్ది పనులు జరుగుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే శాంతి భద్రతలు అనివార్యం. అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎప్పటికపుడు పోలీసు శాఖను అప్రమత్తం చేస్తునే ఉన్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు చర్యలు చేపట్టాం. ప్రజల సమస్యలను పరిష్కరించే వ్యవస్థగా పోలీసును తీర్చిదిద్దుతున్నాం. సిబ్బందికి కూడా ఎప్పటికపుడు ప్రజలతో ఎలా మెలగాలో వివరించి వారికి అవసరమైన తర్ఫీదు ఇస్తున్నాం. వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన నేరాలు తగ్గాయి, కొన్ని ఘటనలు అడపాదడపా కక్షలూ, కార్పణ్యాలతో జరిగితే అందుకు బాధ్యులైన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపింది. స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడమే కాదు, దేశాల సరిహద్దులు దాటి వెళ్లినా వారిని వదిలిపెట్టలేదు. రాష్ట్రానికి రప్పించి వారిని విచారిస్తున్నాం. ప్రభుత్వ చర్యలతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నివారించగలిగాం. రాజకీయ కక్షలకు తావులేకుండా గ్రామాల్లో ప్రజలను చైతన్య పరిచేందుకు కూడా చర్యలు చేపట్టాం. ఎప్పటికపుడు పోలీసు స్టేషన్ స్థాయి వరకూ సిబ్బంది ప్రవర్తనపై సమీక్ష జరుపుతూ నిరంతరం నేరాలకు పాల్పడేవారు లేదా వారితో సంబంధం ఉన్నవారిపై నిఘా కొనసాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లపై కూడా నిఘా కొనసాగుతోంది. నేరాలు జరిగినపుడు వాటిని పరిష్కరించడం అనే కోణంలో కాకుండా నేరాలు లేని రాష్ట్రంగా ఆంధ్రాను తీర్చిదిద్దాలనేదే మా ఆశయం

- నిమ్మకాయల చిన్నరాజప్ప ఉపముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్