ఫోకస్

అన్ని కులాల్లో పేదలను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వేషన్ల వివాదాలకు మూల కారణం సామాజిక, ఆర్థిక అసమానతలు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగించాలి. వీరి కోటాను ముట్టుకోవడానికి వీలులేదు. కాగా ఆర్థికంగా వెనకబాటుతనం అగ్రకులాలుగా ముద్రపడిన వర్గాల్లో పెరిగింది. వీరిని కూడా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. నిరుద్యోగం పెరిగింది. ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. పబ్లిక్ సెక్టార్లు మూతపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం గణనీయంగా తగ్గింది. దీంతో అన్ని రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గాలు, ఈ కోటా లేని వర్గాలు కూడా ఆందోళనకు, కుంగుబాటుకు గురవుతున్నాయి. అలాగే రాజకీయ పార్టీలు కూడా రిజర్వేషన్ల అంశాన్ని స్వలాభానికి వాడుకోరాదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మ్యానిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు చంద్రబాబు స్పందించలేదు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష చేపట్టారు. రిజర్వేషన్లపై హామీ ఇచ్చి ఓట్లు దండుకుని, ఆ తర్వాత నిర్లక్ష్యం చేయడం వల్లనే తుని ఘటనలకు మూలకారణం. తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాజ్యాంగ సవరణతో కూడిన సున్నితమైన అంశాలను అమలు చేస్తామనే హామీ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆయా పార్టీలు కసరత్తు చేయాలి. అంతేకాని ఎన్నికలకు ముందు ఓట్లు ఆకర్షించేందుకు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోకపోవడం వల్ల సమాజంలో అశాంతికి దారితీస్తోంది. చప్రాసీ ఉద్యోగానికి కూడా పిహెచ్‌డి చదివినవాళ్లు దరఖాస్తు చేస్తున్నారు. గ్రామాల్లో అగ్రకుల నిరుపేదల పరిస్ధితి దారుణంగా ఉంది. ఓటు బ్యాంకు కోణాన్ని పక్కనపెట్టి సామాజికంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సమాజాన్ని విభజించి పాలించు అనే ధోరణి వల్ల విచ్ఛిన్నమవుతాం. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూర్చుని కూలంకషంగా చర్చించి రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకుని చట్టానికి సవరణలు చేసి రిజర్వేషన్లు నిజంగా అవసరమనుకునే వర్గాలకు న్యాయం చేయాలి.

- విశే్శ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత