ఫోకస్

కాపులను బిసిల్లో కలిపితే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి చెందిన కాపులను బిసిల్లో కలిపితే సహించేది లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కాపు, బలిజ, ఒంటరి కులాలను బిసి జాబితాలో కలపాలని కాపు ఐక్య గర్జన ద్వారా హింసాత్మక సంఘటనలకు పాల్పడి సమస్యను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. కాపులను బిసిల్లో చేర్చాలంటే ఏయే పద్ధతులు అవలంబించాలి, దానికి గల ప్రక్రియలు కాపునాడు నాయకులకు తెలిసి కూడా ప్రభుత్వాన్ని భయపెట్టి, వత్తిడి తెచ్చి వెంటనే జివో తీసి బిసి జాబితాలో కలపాలని చూడడం సభ్య సమాజం ఏవగించుకుంటోంది. కాపులను బిసి జాబితాలో చేర్చే అంశం రాజకీయ నిర్ణయం కాదు. ఇది పూర్తిగా రాజ్యాంగ బద్ధమైన సాంకేతిక అంశం. రాజ్యాంగం, సుప్రీంకోర్టు, బిసి కమీషన్లు, బిసి జాబితాలో కలపాలనే కులాలకు రెండు ప్రధానమైన పారామీటర్స్ నిర్ణయించారు. ఆ కులం జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం దక్కకపోవడం మొదటి కారణం. సామాజిక వివక్షతకు గురి కావడం రెండో అంశం. ఈ రెండు అంశాలను చూసినప్పుడు కాపులను బిసిల్లో కలపడం సాధ్యం కాదు. కాపుల్లో పేదవారు ఉన్నారు దానికోసం బిసిల్లో కలపాలనేది డిమాండ్. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకంకాదు. సమాజంలో ఇంతవరకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లభించని వారిని బిసి జాబితాలో కలుపుతారు. రాజకీయ పార్టీలు పోటీపడి రాజకీయ స్వార్థంకోసం డిమాండ్లు చేయడం, వారికి మద్దతు పలకడం సరికాదు బిసిలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లను బిసిల జనాభా ప్రకారం 25 శాతం నుంచి 50 శాతం పెంచాలి. కాపులను బిసిల్లో కలిపితే రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్‌లో చేర్చాలి. అలాంటప్పుడు బిసి రిజర్వేషన్లు పెంచి తొమ్మిదవ షెడ్యూల్డ్‌లో చేర్చాలి. టిడిపి ఎన్నికల ప్రణాళికలో పెట్టిన విధంగా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన విధంగా బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా బిసి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలి. కేంద్రంలోని ఓబిసి రిజర్వేషన్లను కూడా ఎబిసిడిలుగా వర్గీకరించాలి. రాష్ట్రంలో మొత్తం కులాల వారిగా జనాభా లెక్కలు తీయాలి. బిసిలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందనే అసంతృప్తి ఉంది. రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించినప్పుడే అసంతృప్తి చల్లారుతుంది.

- ఆర్. కృష్ణయ్య అధ్యక్షుడు, జాతీయ బిసి సంక్షేమ సంఘం