ఫోకస్

బాధ్యత చంద్రబాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపులను బిసి జాబితాలో చేర్పిస్తాననే కీలక హామీతో అత్యధిక జనాభా కల్గిన కాపుల ఓట్లతో పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ముఖ్యమంత్రి కాగల్గిన నారా చంద్రబాబు నాయుడు ఆ హామీని ఎలాంటి పరిస్థితుల్లోనూ నెరవేర్చగలరనే ప్రగాఢ విశ్వాసం మా అందరిలో ఉంది. ఇదే డిమాండ్‌పై తునిలో జరిగిన కాపు గర్జన.. అందులో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనలు, ముద్రగడ పద్మనాభం దీక్ష.. ఆపై విరమణ వీటన్నింటి సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను ఎలాంటి పరిస్థితుల్లోనూ బిసి జాబితాలో చేర్చుతానంటూ పదే పదే స్పష్టం చేస్తూ వస్తుంటే ఇక ఆయనపై ఎవరికి ఎందుకు నమ్మకం, విశ్వాసం ఉండదు. ఇప్పటికిప్పుడే కాపులు బిసి జాబితాలో చేరగలరని ఎవరూ కలలు కనటం లేదు. నివేదిక వెలువడటానికి కనీసం.. అదీ ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా ఏడు మాసాలు పడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు రావటానికి మరో ఎనిమిది మాసాలు అంటే కనీసం అదీ అన్ని అనుకున్నట్లు సవ్యంగా జరిగితే 15 మాసాల వ్యవధి పడుతుంది. అదృష్టం ఏమిటంటే గత ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా కాపులను బిసిలుగా గుర్తిస్తామంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాయి. ఇక దీనికి ఎదురుండదనే భావిస్తున్నాను. ఇందుకోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అలాగే ముద్రగడచే దీక్షను విరమింపచేసిన మంత్రి కె.అచ్చెన్నాయుడు, టిడిపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావుపై తామందరిలో నమ్మకం వుంది. అలాగే ముఖ్యమంత్రి కూడా బిసిల ప్రయోజనాలకు దెబ్బతగలకుండా చూస్తానంటూ పదే పదే చెబుతున్నారు. అయితే స్థానిక సంస్థల రిజర్వేషన్ల భయం ఇప్పుడెందుకు.. అసలు ప్రస్తుతం కాపులకు బిసి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య 2006లో హైదరాబాద్‌లో కాపులు నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు శిబిరాన్ని సందర్శించి మద్దతు నివ్వడమేగాక నాటి బిసి కమిషన్ చైర్మన్ దళవాయి సుబ్రహ్మణ్యంను కలిసి మద్దతు కూడా పలికారు. అలాంటి సీనియర్ నేత ఇప్పుడెందుకు బిసిలను కాపులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారో అర్ధం కావటం లేదు. కాపుల్లో అత్యధికులు నిరుపేదలు, ముఖ్యంగా ఎలాంటి కులవృత్తిలేక అర్ధాకలితో అలమటిస్తున్నారనేది ప్రతి ఒక్కరూ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

- పిళ్లా వెంకటేశ్వరరావు కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు, విజయవాడ