ఫోకస్

నీతిమాలిన రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ఫిరాయింపులు అనేది నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట. ఏ పార్టీలో ఎందుకు ఉన్నాం, ఎందుకు గెలిచాం, ఎందుకు మరో పార్టీలోకి వెళుతున్నామనే ఆలోచనే లేకుండా ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. నేతలు పార్టీలు మారుతున్నా, ప్రజల్లో కూడా పెద్దగా పట్టింపు లేకపోవడం మరింత శోచనీయం. ఒక పార్టీ సిద్ధాంతాలను అనుసరించి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళుతుంటే ప్రశ్నించే పౌరుడే లేరు. దీంతో అధికారం, దర్ఫం, ప్రలోభాలకు లొంగిపోయి విచ్చలవిడిగా పార్టీలు మార్చేస్తున్నారు. గత కొనే్నళ్లగా పార్టీలు ఫిరాయింపులనేది అన్ని పార్టీల్లోనూ అలవాటుగా మారిపోయింది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకర్ష్ పథకం పేరుతో చేసిన పని ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రాలో చంద్రబాబు చేస్తున్నారు. వైఎస్ తన పార్టీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించి కండువా కప్పినప్పుడు విలవిల్లాడిన టిఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు ఆ రెండు పార్టీలు అదే పని చేస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను టిఆర్‌ఎస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసి చేర్చుకుంటుంటే తెలుగుదేశం పార్టీ లబోదిబోమంటోంది. ఎపిలో వైసిపి నేతలను ఇలాగే తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటుంటే వైసిపి ఆందోళన చెందుతోంది. ఇలా అధికారమే పరమావధిగా భావించి పార్టీల నుంచి దూకేస్తుంటే రాజకీయాల్లో విలువలు ఎక్కడున్నాయి? ప్రజల్లో మార్పు వస్తే తప్ప ఇలాంటి రాజకీయ మార్పిడి ఆగదు. ప్రశ్నించే ప్రజలు వౌనంగా ఉన్నంత కాలం ఇలాంటి ఫిరాయింపు రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి పటిష్టమైన చట్టం కావాలి. పటిష్టమైన చట్టం లేకపోవడం, ప్రస్తుతం ఉన్న చట్టాల్లో ఉన్న లొసుగులు వల్లే ఎవరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉండడం లేదు. దీంతో యదేచ్ఛగా ఫిరాయింపులు సాగుతున్నాయి. గవర్నర్ స్థాయిలో కూడా పార్టీ ఫిరాయింపులు చట్టవిరుద్ధమని తెలిసినా చర్యలు తీసుకోలేకపోతున్నారంటే చట్టాల్లో ఉన్న లోపాలే కారణమని వెల్లడవుతోంది. ఇలాంటి వాటికి చెక్‌పెట్టేందుకు కఠిన చట్టం ఉండాలి. ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. తమకు పనులు జరగాలంటే అధికార పార్టీలోనే ఉండాలనే ఆకాంక్షతో ఇతర పార్టీల్లో దూకే నేతలకు ప్రజలు సహకరిస్తున్నారు. ఇలా ప్రజల ధోరణి కొనసాగినంత కాలం ఫిరాయింపులు ఉంటూనే ఉంటాయి.

- కె.రామకృష్ణ, సిపిఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి