ఫోకస్

అసహనానికి స్వస్తి పలకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ సెక్యులర్ దేశం, అన్ని మతాలు సామరస్యంతో ఎవరిప్రచారం వారు చేసుకుంటున్నాయి. సెక్యులర్ దేశంలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఎవరూ కాలరాయలేరు. దేశంలో ఇటీవలి కాలం నుంచి కొంత మేరకు మతపరమైన అభద్రత, అసహనం కలుగుతుందనే భావన బలంగానే వినబడుతుంది. ఈ ప్రభావం మన దేశంతోపాటు ఇతర దేశాలకు పాకవచ్చు. కాబట్టి ప్రధాని మతపరమైన అసహనంపై నోరుమెదపాలి, సున్నితమైన ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోకపోవడం విచారకరం. ప్రస్తుతం సమాజంలో కీలక అంశంగా దావనంలా వ్యాపిస్తున్న ఈ సమస్యకు ముగింపు పలకాలి. ప్రధాని ఏదో ఒక అభిప్రాయాన్ని వెల్లడిస్తే సమస్యకు స్వస్తి పలికినవారవుతారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమాశాల్లో ప్రధాని లేనప్పుడు మతపరమైన అసహనంపై చర్చించడం సబబు కాదు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ సభలో లేనప్పుడు కూడా ఈ అంశంపై మాట్లాడడం తగదు. పార్లమెంట్ సమావేశాల్లో మతపరమైన ఈ అంశాన్ని బిజెపి, కాంగ్రెస్ చర్చకు తేవడం సమయం వృథాయే. అసహనంపై రెండు పార్టీల పరస్పర వాగ్వాదం సభికులను అసహనానికి గురిచేస్తున్నాయి. రెండు పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు లేనప్పుడు మతపరమైన అసహనంపై చర్చసాగడం దురదృష్టకరం. ఈ కీలక అంశంపై బిజెపి, కాంగ్రెస్ పార్టీల చర్చ వెనుక వారి స్వార్ధ ప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. పార్లమెంట్‌లో మతపరమైన సహనం లేదనే అభిప్రాయం కనిపిస్తున్నప్పటికీ ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం ఏదో ఒక అభిప్రాయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెక్యులర్ దేశంలో సర్వమతాలకు ఆమోదయోగ్యమైన సమపాలన అందించాల్సిన అవసరం పాలకులపై ఉంది.

-కటారి శ్రీనివాస్ సామాజిక శాస్తవ్రేత్త