ఫోకస్

ఫిరాయింపులు అనైతికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పార్టీ నుంచి ఎన్నికై, ఆ తర్వాత అధికార పార్టీలోకి చేరడం ప్రజా తీర్పును కాలరాచినట్లే. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీలోకి టిడిపి, కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఫిరాయిస్తున్నారు. ప్రజల ఆశలను వమ్ము చేసి, వారి ఆకాంక్షలకు తిలోదకాలిచ్చి పార్టీ మారడం అంటే ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడవడమే. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, ఇది అనైతికమంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తారు. ఆ స్పీకర్ కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే. ఆ స్పీకర్ అధికారంలో ఉన్న పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది కోర్టును ఆశ్రయిస్తారు. కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. రోజుల తరబడి కోర్టు విచారణ చేస్తుంది. చివరకు చట్టసభల్లో స్పీకర్ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా, తప్పని కోర్టులు తీర్పులు ఇవ్వలేవు. కోర్టులకు, చట్టసభలకు ఒక లక్ష్మణ రేఖ ఉంది. కాని కోర్టులు కొన్ని సంచలనమైన తీర్పులను వెలువరిస్తాయి. కాని వాటిని పాటించే స్ధితిలో మన చట్టసభలు ఉన్నాయా? స్పీకర్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై నిర్ణయం వచ్చే సరికి ఐదేళ్ల కాలం ముగుస్తుంది. దీనివల్ల ఏమి ప్రయోజనం? ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైకాపా పార్టీ ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి అధికారంలో ఉన్న టిడిపి రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతోంది. ఈ తరహా గిమ్మిక్కులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఒకవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం లొంగదీసుకుంటోందని ఫిర్యాదులు చేస్తూ, మరోవైపు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి చేస్తున్నదేమిటి? ప్రజలు ఈ తరహా నీతిలేని రాజకీయాలను ఏవగించుకుంటున్నారు. రాజకీయ పార్టీల ఆలోచన విధానాల్లో మార్పులు రావాలి. అంతేకాని కుశ్చితమైన ధోరణులతో వ్యవస్థను బ్రష్టుపట్టించే విధంగా రాజకీయ పార్టీలు దిగజారరాదు. ఒక ఎమ్మెల్యేకు పార్టీ మారాలనుకుంటే, ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తాజాగా ప్రజల తీర్పును కోరవచ్చు. చట్టంలో మార్పులు కంటే, ఎన్నికల వ్యవస్థలో మార్పులు, సంస్కరణలు రావాలి.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత