ఫోకస్

రాజీనామా చేసి పార్టీ మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమకు నచ్చిన పార్టీలో చేరే స్వేచ్ఛ ఉంటుంది. దీంట్లో ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలో చేరడం అనైతికం, అప్రజాస్వామ్యం. ఒకవేళ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే తాము గెలిచిన పార్టీకి ముందు రాజీనామా చేయడం కనీస ధర్మం. కానీ అలా కాకుండా ఈ మధ్య తెలుగు రాష్ట్రాలు రెండింట్లోనూ ఎమ్మెల్యేలు కొంతమంది తాము గెలిచిన పార్టీకి రాజీనామా చేయకుండానే అధికార పార్టీలో చేరుతున్నారు. ఇది అత్యంత అనైతికం, అప్రజాస్వామికం కూడా. గతంలో ప్రజాప్రతినిధులు తాము గెలిచిన పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా తమ పదవీకాలం ముగిసేవరకు గెలిచిన పార్టీలోనే కొనసాగేవారు. అలాగే అధికార పార్టీ కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకునేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం గెలుపొందిన ఎమ్మెల్యేలు అధికారం లేకుండా బతుకలేమన్న పరిస్థితికి చేరుకున్నారు. ఈ కారణంగానే ఇటు తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార టిఆర్‌ఎస్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిపోతున్నారు. తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడాన్ని అనైతికం అంటూ గగ్గోలు పెట్టే టిడిపి నాయకులు, తమ వరకు వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పని చేస్తున్నారు. అక్కడ ఒప్పు అయితే ఇక్కడ తప్పు ఎలా అవుతుందన్నది వౌలికమైన ప్రశ్న. అక్కడైనా, ఇక్కడైనా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే వారు మొదట తాము గెలిచిన పార్టీకి రాజీనామా చేసి మరో మారడం అనేది సత్సంప్రదాయం.

- కఠారీ శ్రీనివాస్‌రావు రాజకీయ విశే్లషకులు