ఫోకస్

అన్నీ దుర్బుద్ధితో కూడినవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం పార్టీ ఫిరాయింపును చట్టం చేసింది.. కానీ అమలు జరగడం లేదు. ఎంతో విశ్వాసంతో ప్రజలు ఓటు వేస్తారు. వారిని కాదని ఏవో ప్రలోభానికి లోనై పార్టీలు మార్చడం ప్రజలందరినీ మోసం చేసినట్టే. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో పార్టీ మారని నైతిక విలువ కేవలం లోక్‌సత్తా పార్టీకే ఉంది. కాంగ్రెస్‌కు లీడర్ లేడు.. టిడిపికి క్యాడర్ లేదు.. దీనికి కారణం టిఆర్‌ఎస్సే. ఎమ్మెల్యేలను కొనడం టిఆర్‌ఎస్ నైజం అయితే, అమ్ముడు పోవడం కాంగ్రెస్, టిడిపిల దుర్బుద్ధే. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు కెసిఆర్‌పైన ఉన్న భావజాలంతో కాదు. కేవలం పదవుల కోసమే. అభివృద్ధికి ఎప్పుడైనా అపోజిషన్ అవసరం. ప్రతిపక్షం గట్టిగా ఉన్నప్పుడే అధికార పక్షం వైపు ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడే పాలకులు అభివృద్ధి వైపు అడుగేస్తారు. పార్టీలు మారే నాయకులకు మనం ఎందుకు ఓటు వేయాలి? మనకు మనం ప్రశ్నించుకుంటేనే మనలో చైతన్యం వస్తుంది. ప్రజలను మోసగించే నాయకులను రాజకీయంగా బహిష్కరించాలి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌కు బలం అవసరం లేదు. పాలనకు సరిపడా మెజార్టీ ఉంది. అలాంటప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తనవైపు లాగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. టిఆర్‌ఎస్ ఒక రైతు బజారులా మారింది. ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వారిని పార్టీలోకి తీసుకొని వారిని రాజీనామా చేయకుండానే తన (కెసిఆర్) పార్టీలో చేర్పించుకొని మంత్రి పదవులు ఇస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది. టిడిపి, కాంగ్రెస్ పార్టీలను నామరూపాల్లేకుండా చేయడమే కెసిఆర్ లక్ష్యం. టిడిపి, టిఆర్‌ఎస్ పార్టీలు అంతర్గతంగా ఒక్కటయ్యారు. రేవంత్‌రెడ్డి టిఆర్‌ఎస్‌పై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఫిరాయింపులను లోక్‌సత్తా వ్యతిరేకిస్తుంది. నాయకులు పార్టీలు మారకుండా నైతిక విలువలు కాపాడుకోగలిగినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. తమను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల పట్ల విశ్వాసం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి.

-పాండురంగా రావు లోక్‌సత్తా పార్టీ, రాష్ట్ర నాయకులు