ఫోకస్

అర్థవంతమైన చర్చ సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టసభల్లో చర్చలు అర్థవంతంగా జరిగినప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. దేశానికి మేలు జరుగుతుంది. అధికార పక్షం, విపక్షం మల్లయుద్ధం చేసుకున్నట్టు మాటల యుద్ధం చేయడానికే చట్ట సభలో పరిమితం కారాదు. క్రమంగా దేశంలోని చట్టసభల్లో చర్చల స్థాయి తగ్గి సభను అడ్డుకోవడమే ప్రధానంగా మారిపోయింది. అధికార పక్షం, విపక్షం స్థానాలు మారవచ్చు కానీ ఈ పరిస్థితి మాత్రం మారడం లేదు. పార్లమెంటులో అసహనంపై చర్చలో కూడా అధికార పక్షం సహనంగా ఉండలేకపోతోందనే విమర్శ వినిపిస్తోంది. సభ సజావుగా సాగేందుకు అధికార పక్షం, విపక్షం రెండింటికి బాధ్యత ఉంది. ఇద్దరూ ప్రజల కోసమే సభలో ఉన్నారు. ఒకరినొకరు శత్రుపక్షంగా చూసుకోవలసిన అవసరం లేదు. పార్లమెంటు అయినా, అసెంబ్లీ అయినా చర్చలు జరగకుండా స్తంబించిపోతే మీడియాలో వార్తలకు ఉపయోగపడవచ్చు కానీ ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ సమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగితే అది ప్రజలకు మేలు చేస్తుంది. చర్చలో అధికార పక్షాన్ని నిలదీయవచ్చు, ప్రజలకు మేలు చేయమని కోరవచ్చు, ప్రజా వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడితే చర్చల ద్వారా నిలదీయవచ్చు, అధికార పక్షం తప్పును ప్రజల దృష్టికి తీసుకెళ్లవచ్చు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కన్నా మీడియా కోసమే పని చేయడం ఎక్కువ కనిపిస్తోంది. టిఆర్‌ఎస్ విపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సమస్యలపై టిఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అర్థవంతంగా వివరించారు. ప్రభుత్వం సైతం సమాధానం చెప్పలేక పోయింది. తెలంగాణ పట్ల పాలకులు చూపించిన వివక్షను సభ సాక్షిగా సభ్యులు వివరించగలిగారు. సభ్యులకు సమస్యల పట్ల వివిధ అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇది సాధ్యం అవుతుంది. సభలో పట్టుమని పది నిమిషాలు అర్ధవంతంగా మాట్లాడకుండా సభ జరగకుండా అడ్డుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? తెలంగాణ శాసన సభలో ఈ సంస్కృతికి చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సభను నడవనివ్వకుండా అడ్డుకోవడమే అజెండాగా సభలోకి వస్తే సభను ఎలా నడిపించుకోవాలో మాకు తెలుసు అని ప్రారంభంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. పార్లమెంటు, అసెంబ్లీలు చట్టసభలో ఎక్కడైనా చర్చల ద్వారానే సమస్యలకు సమాధానాలు రాబట్టుకోవాలి. చట్ట సభల పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లక ముందే సభలు చర్చించేందుకే ఉన్నాయి కానీ అడ్డుకోవడానికి కాదని గ్రహించడం అందరికీ మంచిది.

- కర్నె ప్రభాకర్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ