ఫోకస్

ప్రజాస్వామ్యానికే ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీలోని జెఎన్‌యులో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసన విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అత్యంత అసంబద్ధంగా వ్యవహరించింది. కేంద్రం తీరును బట్టి ‘హీ ఈజ్ ఒన్ వరస్ట్ ఎనిమి’ అన్న నానుడి గుర్తుకువచ్చింది. కేంద్రం కథనాన్ని బట్టి జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలను తాము ఖండించినట్టుగా చెబుతున్న విద్యార్థులు మాత్రం తాము ఏ తప్పు చేయలేదంటున్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఆ సమావేశం ఎలాంటి సమస్యలకు తావు లేదని ముగిసిపోయేది, దానిని ప్రతి ఒక్కరూ మరిచిపోయి ఉండేవారు. కానీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటి వెనుక బిజెపి, దాని విద్యార్థి విభాగం ఎబివిఎస్‌యు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఎంపి మహేశ్‌గిరి అలాగే బిజెపి విద్యార్థి యూనియన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులపై దేశద్రోహం కేసు పెట్టారు. అయితే ఎలాంటి రాజకీయ వత్తిడి లేకుండా పోలీసులు తమ వృత్తి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడం అసాధ్యం. జెఎన్‌యు విద్యార్థుల నిరసన వెనుక పాకిస్తాన్ టెర్రరిస్టు గ్రూఫ్ అధినేత హాఫీజ్ సయాద్ ఉన్నట్టుగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించడం వల్ల జెఎన్‌యు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ తీరు అసంబద్ధ ధోరణికి అద్దం పడుతోంది. ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాద సంకేతం.

- జస్టిస్ రాజేందర్ సచార్ రిటైర్డు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఢిల్లీ