ఫోకస్

వర్శిటీలను ఆర్‌ఎస్‌ఎస్ నడిపిస్తోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలను ఆర్‌ఎస్‌ఎస్ నడిపిస్తోందా అనే భావన వ్యక్తమవుతోంది. జెఎన్‌యులో సంఘటనలు గానీ, అంతకుముందు జరిగిన హెచ్‌సియు సంఘటనను గానీ నిశితంగా పరిశీలిస్తే అసహనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా హరిస్తోంది. ఎన్‌డిఏ ప్రభుత్వ మతతత్వ అజెండాను విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలనే ప్రయత్నాలే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నాయి. విద్యను వ్యాపారం చేసేవాళ్లను వదిలేసి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివేవాళ్లను అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలు ఎవరు చేసినా సహించకూడదు. కఠిన చర్యలు తీసుకోవాలి, దానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తాం. కానీ కేంద్ర మంత్రులు సైతం జోక్యం చేసుకుని జాతి వ్యతిరేక నినాదాలతో సంబంధం లేని వాళ్లను కేసుల్లో ఇరికిస్తున్నారు. జెఎన్‌యులో విద్యార్థి సంఘం నేత కన్హయ్యను రాజద్రోహం కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారు. అతను చేసిన నేరం ఏమిటి, జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. అయినప్పటికీ ఉగ్రవాదిగా ముద్రవేసి జైలుకు పంపారు. ముఖ్యంగా మతోన్మాదంతో ఉన్న మోదీ ప్రభుత్వం వామపక్షాల నేతలపై దాడులకు దిగడం, కేసులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను రాజ్యాంగంలోని అర్టికల్ 19 కల్పిస్తోంది. దానికి తాము మద్దతు ఇస్తాం. కానీ తాము చెప్పించే చట్టం, మిగిలినవాళ్లు చెప్పింది చట్టవ్యతిరేకమనే ధోరణి ఎంతవరకు కరెక్ట్? ఉరితీతను 104 దేశాలు బహిష్కరించాయి. కానీ మనదేశంలో ఎంతోమందిని ఉరితీస్తున్నారు. మహాత్మాగాంధీని చంపిన నాధూరామ్ గాడ్సే గొప్పవాడని, దేశభక్తుడని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు అంటున్నాయ. గాడ్సే విగ్రహం పెట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం... ఇదేనా దేశభక్తి? అఫ్జల్ గురును ఉరితీసినందుకు అనేక విమర్శలు చేసిన జమ్మూకాశ్మీర్‌లోని పిడిపి పార్టీని నెత్తిన పెట్టుకున్నారు. అఫ్జల్‌గురును ఉరితీసినందుకు అక్కడ కూడా ర్యాలీలు, నిరసనలు తెలిపారు. మరి పిడిపి నేతలను ఒక్క మాట కూడా ఎందుకు అనరు? అక్కడ ఆ పార్టీతో బిజెపి మైత్రి కలిగి ఉంది కాబట్టి ఒక్క మాట కూడా అనడం లేదు. మరిఇక్కడ కొందరు అదే నినాదాలు చేసి ప్రదర్శనలు నిర్వహిస్తే మాత్రం రాజద్రోహ నేరం కేసు నమోదు చేశారు. ఎందుకు ఇలా ద్వంద్వనీతిని బిజెపి నాయకత్వం వహిస్తోంది. అన్ని వర్గాలు ఇలాంటి అసహన చర్యలను ఖండించాల్సిందే. ఒక్క జెఎన్‌యు సంఘటనగా చూడకుండా మొత్తం బిజెపి, దాని అనుబంధ పార్టీలు, సంస్థలు ఒకే అజెండాగా ముందుకెళ్లడం దేశానికి ప్రమాదంగా పరిణమిస్తున్నాయని భావించాల్సి ఉంది.

- వై.వి.రావు సిపిఎం, ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు