ఫోకస్

నిర్లక్ష్యం నీడలో వర్సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యాలయాల నుండి సంస్కారం కలిగిన, క్రమశిక్షణ కలిగిన భావి భారత పౌరులు ఉద్భవిస్తుంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన విశ్వవిద్యాలయాల్లో అలజడులు రేగుతున్నాయి. అనేక యూనివర్సిటీలకు వైస్‌ఛాన్సలర్లు లేకపోవడంతో ఇంచార్జీల పాలనలోనే కొనసాగుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు సగానికిపైగా ఖాళీగా ఉన్నప్పటికీ, వీటిని భర్తీ చేయడం లేదు. యూనివర్సిటీలకు ఇవ్వాల్సిన నిధులు సకాలంలో ఇవ్వడం లేదు. విశ్వవిద్యాలయాలను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు. జెఎన్‌యు మొదటి నుండి వామపక్షాలకు పుట్టినిలు. ఈ విశ్వవిద్యాలయంలో కొంతమంది విద్యార్థులు ఉరిశిక్షను వ్యతిరేకించారు. వాస్తవంగా ప్రపంచంలో 30-40 దేశాల్లో ఉరిశిక్ష వేయడాన్ని రద్దు చేశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి జీవితఖైదు విధించడంలేదా ఇతరత్రా శిక్షలు వేస్తున్నారు. ఉరిశిక్షను వ్యతిరేకిస్తే దేశద్రోహం నేరం కిందకు వస్తుందని భావించడం లేదు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం విశ్వవిద్యాయాల్లో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు సామాజిక అంశాలపై పరిశోధనలు ఎక్కువగా జరుపుతున్నారు. తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు అణచివేతకు గురవుతుండటంతో సామాజిక అంశాలపై పరిశోధనలు అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా పరిశోధనలు జరగాల్సిందే. ఇదే సమయంలో బిజెపి, దాని అనుబంధ సంస్థలు యూనివర్సిటీల్లో సనాతన భారతీయ సంప్రదాయాలను, హిందూ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో రెండు విభిన్న అభిప్రాయాలు కలిగిన విద్యార్థుల మధ్య తరచూ వివాదం చెలరేగుతోంది. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో చెలరేగిన దుమారాన్ని పక్కదారి పట్టించేందుకు, బిజెపి దాని అనుబంధ సంస్థలు జెఎన్‌యును కేంద్ర బిందువుగా చేసుకున్నాయి. దేశద్రోహం పేరుతో విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ తదితరులపై కేసులు నమోదు చేశారు. ఇది సరైన విధానం కాదు. విద్యార్థులు ఎవరైనా తప్పు చేస్తే, అనేక రకాల చర్యలున్నాయి. క్రమశిక్షణను పాజిటివ్ కోణంలో ఆలోచించాలి. యూనివర్సిటీ ఆవరణలో వైస్‌ఛాన్సలర్లు నిరంతరం పరిశీలన చేయడంతోపాటు పర్యవేక్షిస్తుండాలి. హాస్టళ్లను తరచూ తనిఖీ చేస్తూ, విద్యార్థుల మంచిచెడులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి.

- చుక్కా రామయ్య, విద్యావేత్త