ఫోకస్

వ్యతిరేకిస్తే దేశ ద్రోహమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజధాని ఢిల్లీలో జవహర్‌లాల్ యూనివర్సిటీలో ఇటీవల జరుగుతున్న హింసాత్మక ఘటనలు దేశ ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఇటువంటి సంఘటనలను ఖండించాలి. దేశంకోసం ప్రాణ త్యాగం చేసి గాంధీ కుటుంబం వారసునిగా వచ్చిన రాహుల్ గాంధీపై మతతత్వ శక్తులు, బిజెపి నాయకులు విమర్శలు చేయడం దారుణం. కాశ్మీరు వేర్పాటువాద శక్తులతో చేతులు కలిపి కాశ్మీర్‌లో పిడిపితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్న బిజెపి నాయకులు జాతీయత, దేశభక్తి అంటూ బూటకపు మాటలు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. విశ్వ విద్యాలయాల్లో బిజెపి, ఆ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అనుసరిస్తున్న వైఖరి దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల హక్కులను కాలరాస్తున్నది. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌గురుకు శిక్ష విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అలాంటి దేశ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతు ఉండదు. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. కేంద్రంలో, రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి దురాగతాల విషయంలో కఠినంగా వ్యవహారించాం. కానీ విశ్వ విద్యాలయాల్లో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నది. అందుకు ఎవరైనా అడ్డుపడినా, అడ్డు చెప్పినా దేశ ద్రోహం అంటూ అణిచి వేసే కుట్రలు చేస్తున్నది. జాతి వ్యతిరేక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్ధమైన పనులను కాంగ్రెస్ ఖండిస్తున్నది. బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత విశ్వ విద్యాలయాల్లో వాతావరణం పూర్తిగా చెడిపోయింది. కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు పెట్టడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. పాటియాల కోర్టు వద్ద కొంత మంది మతతత్వవాదులు న్యాయవాదులపై, జర్నలిస్టులపై, విద్యార్థులపై దాడులు చేశారు. ఇందులో ఒక బిజెపి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణం. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం మానుకుంటే మంచిది. కన్హయ్యపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తి వేయాలి. విశ్వ విద్యాలయాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా కృషి చేయాలని కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

- కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షుడు, తెలంగాణ పిసిసి