ఫోకస్

వర్సిటీల్లో విద్రోహమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో జెఎన్‌యు ఒకటి. దేశానికి అనేకమంది శాస్తవ్రేత్తలను, రాజకీయ నాయకులను, మేధావులను అందించిన వర్శిటీ అది. విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక దృక్పథాన్ని జెఎన్‌యు బోధిస్తుంది. దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై అక్కడి విద్యార్థులు నిరంతరం స్పందిస్తూనే ఉంటారు. ప్రభుత్వాలకు నివేదికలు ఇవ్వడం కూడా సహజంగా జరుగుతున్నదే. 1969లో ప్రారంభమైన 47 ఏళ్ల ప్రస్థానంలో జెఎన్‌యు అనేక అవరోధాలను అధిగమించింది. జెఎన్‌యుకు ‘నేక్’ 4 పాయింట్లకు గానూ 3.9 పాయింట్లను కేటాయించి అగ్రస్థానంలో నిలిపింది. వెయ్యి ఎకరాల్లోని ఈ విశ్వవిద్యాలయంలో దాదాపు 8500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తొలి నుండి జెఎన్‌యు వామపక్ష విద్యార్థి ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉండటం, కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాగానే జెఎన్‌యులో ఎబివిపి తన ప్రభావాన్ని చూపించడంతో ఘర్షణ వాతావరణం మొదలైంది. కొంతమంది విద్యార్థులు నిరంతరం హిందుత్వ వ్యతిరేక ఉద్యమాలను నిర్వహించడం, దానిని బిజెపి, ఎబివిపిలు అడ్డుకోవడంతో చినికి చినికి గాలివానగా మొదలైన ఘర్షణ అతి పెద్ద ఉద్యమంగా రూపుదిద్దుకుంది. యూనివర్శిటీలో కన్హయ కుమార్ అరెస్టుకు నిరసన తెలిపేందుకు శాంతియుతంగా విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్‌లో గుమిగూడినప్పుడు అక్కడికి రాహుల్ గాంధీ రావడం, ఆయనకోసం మీడియా దూసుకురావడం, గుంపులో గోవింద అన్నట్టు కొంతమంది పరస్పర వ్యతిరేక నినాదాలు చేయడంతో యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇదే తరహా వివాదం జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలోనూ చోటు చేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రగులుకున్న వివాదం దేశంలో మిగిలిన వర్శిటీలకూ పాకుతోంది. ఈ ఉద్యమాల వెనుక ఉన్నవారెవరు? వారి లక్ష్యాలు ఏమిటి? ఈ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? అంతర్గత లాభాపేక్ష ఏమిటి? ఈ వారం ఫోకస్ ఈ అంశంపైనే... నిపుణుల అభిప్రాయాలు చదవండి...