ఫోకస్

సంయమనం పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా, పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలన్నా అందుకు అధికార పక్షం ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. ప్రభుత్వం, దానిలోని మంత్రులు, ఎంపీలు ప్రజా సమస్యలను పరిష్కరించాలనే సంకల్పం కలిగి ఉండాలి తప్ప ప్రతిపక్షాలను పక్కదారి పట్టించడం, రెచ్చగొట్టడం వంటి భిన్నపోకలకు పోకూడదు. గత పార్లమెంటు సమావేశాలు ఒక్కరోజు కూడా సరిగ్గా జరగలేదు. ప్రజాధనం, విలువైన పార్లమెంటు సమయం ఎంతో వృథా అయింది. ఇందుకు కారణం ఏమిటనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు జరుగుతున్న సమావేశాలు గతంతో పోలిస్తే కొంచెం మెరుగ్గా ఉన్నాయి. అందుకు సంతోషం. అయితే పార్లమెంటు వేదికగా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకాలి. అందుకు ప్రతిపక్షాలూ సహకరించాలి, అధికార పక్షం సంయమనం పాటించాలి. ప్రతిదానికి రాద్ధాంతం చేయాలని ప్రతిపక్షాలు భావించడం కూడా సరికాదు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా సంయమనం పాటించడం లేదు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడ్డం వల్ల ప్రయోజనం లేదు. సభ సజావుగా జరగదు. అందుకు ప్రధాన బాధ్యత అధికార పక్షానిదే అవుతుంది. కొందరు ఎంపీలు, కేంద్రమంత్రులు కూడా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి మాట్లాడుతున్నారు. ఎన్నో ముఖ్యమైన అంశాలు పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రావాల్సి ఉంది. ఎపికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీలు, ప్రజలకు మేలు జరగాల్సిన పనులు, ప్రాజెక్టులపై చర్చ చేపట్టాలి. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా జరిగేందుకు అధికార పక్షం, ప్రతిపక్షాలు కూడా సమబాధ్యత వహించాలి. ఈసారి సమావేశాల్లో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ‘్భవ ప్రకటన స్వేచ్ఛపై దాడి’ గురించి స్పష్టమైన చర్చ జరగాలి. దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజానీకానికి అవసరమైన చర్చ జరగాలి తప్ప ఏదో ఏకపక్షంగా సభ జరుపుకుని పోదామనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రజా సమస్యలను వినిపించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి, ప్రతిపక్షాల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని వాటిని పరిష్కరిస్తే చివరకు ప్రజలకే మేలు జరుగుతుంది. అంతేకాని ప్రతిపక్షాల గొంతునొక్కాలని ప్రయత్నిస్తే ఏ సభా సరిగా జరగదు. అర్థవంతమైన చర్చ జరిగి సమస్యలు పరిష్కరించుకుంటున్నామనే భావనతో ఉండాలి తప్ప అధికార పక్ష సభ్యులు, మంత్రులు ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దు. అప్పుడే పార్లమెంటరీ విలువలు నిలబడతాయి.

- కె.రామకృష్ణ సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి