ఫోకస్

కనీస మద్దతు ధర ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కోసారి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయి వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం, కొన్నిసార్లు టమోటా లాంటివి రూపాయికి కిలో చొప్పున పడిపోయి రైతులను కన్నీళ్లు పెట్టించడం ఆనవాయితీగా మారింది. ఈ విధానం వల్ల ఆటు రైతులకు ప్రయోజనం కలగడం లేదు, ఇటు వినియోగదారులు సంతోషంగా లేరు. కూరగాయలకు కూడా కనీస మద్దతు ధర నిర్ణయించాలి. అంతకంటే తక్కువ ధరకు కొనడం చట్ట వ్యతిరేకంగా నిర్ణయించాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఉండాలి. టమోటా ధర పది రూపాయలున్నా, రెండు రూపాయలున్నా వినియోగం ఒకేలా ఉంటుంది. వినియోగదారులు భరించేస్థాయిలో మద్దతు ధర ఉండాలి. గత సీజన్‌లో ఉల్లిగడ్డ ధర విపరీతంగా పెరగడంతో ఈసారి చాలామంది ఉల్లిగడ్డ పండించారు. తీరా పంట చేతికి వచ్చాక ధర పడిపోయింది. దేశంలో ఎన్ని మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలు, టమోటాలు, ఇతర కూరగాయలు పండిస్తున్నారో, ఎన్ని టన్నులు అవసరం అవుతాయో ఒక సాధారణ రైతుకు తెలియదు. ఈ పని చేయాల్సింది ప్రభుత్వం. కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలం అవుతున్న ప్రభుత్వం కనీసం ఏ పంట ఎంత ఉత్పత్తి అవుతుంది? ఏ పంట పండిస్తే బాగుంటుందని, రైతులకు అవగాహన కల్పించడం లేదు. సిమెంట్ ఉత్పత్తి ఎక్కువ కాగానే ధర పడిపోకుండా సిమెంట్ ఉత్పత్తి దారులంతా సమావేశమై ఉత్పత్తిని ఏ మేరకు తగ్గించుకోవాలి, ఏ కంపెనీ ఎంత తగ్గించుకోవాలో నిర్ణయించుకుని అమలు చేస్తారు. పౌల్ట్రీలోనూ ఇదే విధానం అమలు చేస్తారు. ధర పడిపోకుండా చూసుకుంటారు. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి అసంఘటితంగా ఉండడంవల్ల ప్రభుత్వం సరైన సహకారం అందించదు. ధర పెరిగినా, తగ్గినా రైతులకు ప్రయోజనం కలగడం లేదు. విత్తన ఉత్పత్తి కంపెనీలు ఏ విత్తనాల్లో ఎక్కువ లాభం వస్తుంది అనుకుంటే వాటిని ఇబ్బడిముబ్బడిగా మార్కెట్‌లో విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారు. తీరా ఆ కూరగాయలకు సరైన ధర లభించక రైతులు దెబ్బతింటున్నారు. కనీసం రాష్ట్ర స్థాయిలోనైనా కూరగాయలు ఎంతవరకు అవసరం, ఎంతవరకు పండించాలి? అనేది ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి రైతులకు అవగాహన కల్పించాలి. ఉల్లి ధర పెరిగినప్పుడు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసి వినియోగదారులను ఆదుకున్నట్టే, కూరగాయల ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వచేయాలి.

- ముదిగంటి శ్రీధర్‌రెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి