ఫోకస్

ప్రభుత్వ జోక్యం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరగాయల ధరలు ఒకవైపు రైతులకు లాభదాయకంగా, మరోవైపు వినియోగదారులకు తక్కువగా లభించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంది. కీలక సమయాల్లో ఈ ధరలు మార్కెట్లో భారీగా పడిపోకుండా ఉండేందుకు వీలుగా ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్’ (ఎంఐఎఫ్) ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఒకే రకం కాయగూరలను రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండించిన సమయంలో కాని, ఏదైనా ఒకేరకం కాయగూర ఎక్కువ ఉత్పత్తి జరిగిన సమయంలో కానీ ధరలు పడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు వీలుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అవసరం ఎంతో ఉంటుంది. దీనివల్ల పంట ఉత్పత్తులను వెంటనే రైతుల నుండి కొనుగోలు చేసి వినియోగదారులకు చౌకధరలకు విక్రయించేందుకు వీలవుతుంది. అలాగే కూరగాయల ధరలు మార్కెట్లో పెరిగిన సందర్భాలలో ధరల స్థిరీకరణ నిధి (మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్)ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఒకవైపు రైతులు, మరోవైపు వినియోగదారుడికి చేయూత ఇచ్చినట్టవుతుంది. ప్రస్తుతం కూరగాయలకు కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్‌ప్రైస్-ఎంఎస్‌పి) వర్తించడం లేదు. అన్ని పంటలలాగే కూరగాయలకు కూడా ఎంఎస్‌పి వర్తింప చేయాలి. దీనివల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కూరగాయలకు ఎంఎస్‌పి ఏమిటి అన్న అనుమానం చాలా మందిలో రావచ్చు. కాని వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే ఎంఎస్‌పి లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లో దళారుల రాజ్యం నడుస్తోంది. మరోవైపు రైతులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సి ఉంది. మన రాష్ట్రంలో ఒక ఎకరంలో ఐదారు క్వింటాళ్ల కూరగాయలు పండితే ఇజ్రాయిల్‌లో ఒక ఎకరంలో 60-70 క్వింటాళ్ల కూరగాయలు పండుతున్నాయి. దీనికి హరిత గృహాల ద్వారా పంటల విధానం (గ్రీన్ హౌజ్ కల్టివేషన్) ఉపయోగపడుతుంది. ఒక ఎకరంలో గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కోసం 32 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎకరానికి 28 లక్షల రూపాయలు సబ్సిడీగా ఇస్తోంది. మిగతా మొత్తాన్ని రైతులు భరించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఒక ఎకరంపై ఖర్చులన్నీ పోగా నెలకు రైతుకు లక్ష రూపాయలు ఆదాయం లభిస్తుంది. అంటే ఒక సంవత్సరంలో 10 నుండి 12 లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. పైగా జలాశయాల్లో నిలువ చేసే ఒక టిఎంసి నీటితో ఆరువేల ఎకరాల్లో వరిపంటను పండించగలిగితే, అంతేనీటితో కూరగాయల పంటలు 15 వేల ఎకరాల్లో పండించేందుకు వీలవుతుంది. విశ్వవిద్యాలయాలు ఎక్కువ ఉత్పత్తి వచ్చే విత్తనాలను రూపొందించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఉద్యాన శాఖాధికారులు రైతులకు ఈ అంశంలో చేయూత ఇవ్వాలి.

- పిడిగం సైదయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్, శాస్తవ్రేత్త, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం.