ఫోకస్

ఎవరికి ఓటు వేశామో తెలియాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటు వేసిన తర్వాత స్లిప్ వచ్చే పద్ధతిని ఎన్నికల సంఘం ప్రవేశపెట్టడం శుభపరిణామం. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టింది. అయితే వరంగల్‌లో చేపట్టకపోయినా, ఖమ్మంలోని 35 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే ప్రతిపాదించారు. వరంగల్‌లో కూడా చేపట్టి ఉంటే బాగుండేది. అయితే ఓటర్లకు ఓటు వేసిన తర్వాత తాను ఏ అభ్యర్థికైతే ఓటు వేశానో అనేది తెలిసేలా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నుంచి ‘చిటీ’ వస్తే బాగుంటుంది. అయితే ఆ ‘చిటీ’ని బయటకు తేకుండా అక్కడే బాక్స్‌లో పడేలా చూడాలి. ఓటు వేసిన తర్వాత ఫలానా అభ్యర్థికి ఓటు వేసినట్లు చిటీ తేస్తే రహాస్యం అనేది ఉండదు. అలా బయటకు తెచ్చేందుకు అనుమతిస్తే గొడవలు జరిగిపోతాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఓటరు తాను వేసిన ఓటు సక్రమంగా పడిందా లేదా? అనేది చిటీ ద్వారా తెలియాలే తప్ప బహిర్గతం కాకూడదు. తద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలా చేయడం ద్వారా ఓటరుకు ఉన్న అనుమానాలు నివృత్తి అవుతాయి. తాజాగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఇవిఎం)లపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఓట్లు తారు-మారు అవుతున్నాయని, ఇవిఎంలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేసినా, ముందే ‘్ఫక్స్’ చేసిన అభ్యర్థికే ఆ ఓటు బదిలీ అయ్యేలా అమరుస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇవిఎంలు రాక ముందు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఎవరికి బలం ఉంటే వారు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి, పోలింగ్ అధికారుల నుంచి బ్యాలెట్ పేపర్లు లాక్కొని ఓట్లు వేసి బాక్స్‌లో వేసే వారు. ఇవిఎంల వల్ల ఆ తలనొప్పి కొంత తగ్గిందనే చెప్పవచ్చు. ఇప్పుడు మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రెండు రోజుల పాటు నిర్వహిస్తే బాగుంటుంది.

- గండ్ర వెంకటరమణా రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు