ఫోకస్

ఆరోపణలకు ఇక అవకాశం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా ఇవిఎం ద్వారా ఓటుకు రసీదు చేర్చడం తెలంగాణలోనే తొలిసారి కావడం విశేషం. ఇవిఎంల ద్వారా ఓటు వేసినప్పుడు కొన్ని రాజకీయ పక్షాలకు, కొందరు వ్యక్తులకు అనుమానం ఉండేది. తాము వేసిన ఓటు తాము కోరుకున్న పార్టీకే పడుతుందా లేదా అని. ఓడిపోయిన రాజకీయ పార్టీ ఇవిఎంల వల్లనే ఓడిపోయాం లేకపోతే ఘన విజయం సాధించే వాళ్లం అని చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఇవిఎంలకు ప్రింటర్‌ను జత చేయడం ద్వారా ఇలా ఆరోపణలు చేసే అవకాశం ఉండదు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని అంతత్వరగా స్వీకరించలేరు. దేశానికి టెక్నాలజీని మేమే తీసుకువచ్చాం అని ప్రచారం చేసుకునే నాయకులు సైతం 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోగానే ఇవిఎంల వల్లనే ఓడిపోయాం, లేకపోతే విజయం మాదే అని చెప్పుకున్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో విపక్షాలకు కనీసం డిపాజిట్ దక్కలేదు. దాంతో కాంగ్రెస్ నాయకులు ఇవిఎంల వల్లనే ఓడిపోయాం అంటూ కోర్టుకు వెళ్లారు. మీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అని పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం ఇదే విధంగా తమ వైఫల్యాలను ఇవిఎంలపైకి తోశారు. ప్రజాభిమానాన్ని చూరగొంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలన సాగిస్తున్నారు. దాంతో ప్రజలు టిఆర్‌ఎస్‌ను ప్రతి ఎన్నికల్లో ఆదరిస్తున్నారు. విపక్షాలకు డిపాజిట్లు దక్కడం లేదు. ప్రజలు తమను ఎందుకు తిరస్కరిస్తున్నారో విపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవడానికి బదులు ఇవిఎం వల్లనే ఓటమి అని తప్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇవిఎంలకు ప్రింటర్లను జతచేశారు. ఏ పార్టీకి ఓటు వేసింది ప్రింటర్లో ఓటరు అక్కడికక్కడే చూసుకోవచ్చు. ఇది మంచి పరిణామం.

- ఎర్రోళ్ల శ్రీనివాస్ టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు