ఫోకస్

లోపాలుంటే సరిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల సంఘం కొన్ని సంవత్సరాల నుంచి ఇవిఎంలను వినియోగిస్తోంది. ప్రారంభం నుంచీ ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు పలు రాజకీయ పార్టీలు పెద్దఎత్తున విమర్శలు, ఆరోపణలు చేశాయి. అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయని అంటూ ఉండేవారు. కానీ ఏ ఒక్క ఆరోపణ ఆచరణలో రుజువు కాలేదు. ఈవిఎంల వినియోగానికి ముందు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించినప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. రిగ్గింగ్ జరుగుతున్నాయని, చాలా సులభంగా ఓట్లు పంచుకుంటున్నారనే విమర్శలు కోకొల్లలుగా వచ్చేవి. టెక్నాలజీ విస్తరించడంతో ఈ ఆరోపణలకు చెక్ పెడుతూ ఈవిఎంలను వృద్ధి చేశారు. మంచిదే, మార్పులు జరుగుతూ ఉంటే కొత్త సదుపాయం అందుబాటులోకి రావడం హర్షించదగిన పరిణామం. ఎన్నికల అనంతరం ఫలితాలు వేగంగా రావడంతో పాటు ఓటింగ్‌కు పూర్తి పారదర్శకత ఏర్పడింది. అయితే ఎన్నికల ఫలితాలు చాలా సందర్భాల్లో వన్‌సైడ్‌గా ఒకే పార్టీకి వచ్చినప్పుడు ఈవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు సహజంగా వచ్చాయి. కానీ ఒక్క ఆరోపణ కూడా నిరూపణ కాలేదు. దీన్ని బట్టి అర్థమయ్యింది ఏమిటంటే ఆరోపణలు చేసే కన్నా ఈవిఎంల వినియోగం, వాటి ఉపయోగాలు, సాంకేతిక అంశాల గురించి పూర్తి స్థాయి అవగాహన తీసుకురావడం సరైన పరిష్కారం. కొన్ని సందర్భాల్లో ఓటింగ్ యంత్రాలు పనిచేయకుండా మొరాయిస్తాయి. తాజాగా తాము వేసిన ఓటు ఖచ్చితంగా ఆ పార్టీకే వెళ్లిందా లేదా అనేది తెలుసుకునేందుకు రసీదు వెల్లడయ్యే పద్ధతిని ఈసి అందుబాటులోకి తెచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోపాలు ఉంటే సరిచేసే ప్రయత్నం జరగాలి. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో ఇంకా బ్యాలెట్ పేపర్లపై ఆధారపడి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే మనదేశంలో బ్యాలెట్ పేపర్ పోయి, ఈవిఎంలు వచ్చాయి. ఆరోపణలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో కూడిన ఈవిఎంలను ఎన్నికల్లో వినియోగిస్తే మంచిది.

- కె.రామకృష్ణ సిపిఐ,ఎపి రాష్ట్ర కార్యదర్శి