ఫోకస్

టెక్నాలజీ వినియోగం మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను వాడడం మారుతున్న కాలానికనుగుణంగా నూతన టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే.. కానీ అది అందరికీ అందుబాటులో ఉండేవిధంగా, వినియోగంపై అవగాహన కూడా అవసరం. అవగాహన లేని టెక్నాలజీ వినియోగిస్తే తనపై తనకే అనుమానం వచ్చే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఓటర్లను చైతన్యపరచాలి. అందుకు అధికారుల కృషితోపాటు రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా చర్యలు చేపట్టాలి. ఇ-గవర్నెన్స్, గ్లోబల్ డిజిటలైజేషన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వాడకం అభివృద్ధిలో ఒక భాగమే. అయితే ఓటింగ్‌లో అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడుతున్నామనడం అవివేకం. ఓటింగ్‌లో అక్రమాలు బ్యాలెట్ పత్రాలతోనూ, ఇవిఎంలతోనూ జరగొచ్చు. ప్రస్తుతం కొత్తగా తీసుకువచ్చిన ఓటు వేసినట్టుగా రశీదు వచ్చే విధానంతో ఓటరు తాను వేసిన ఓటు ఫలానా అభ్యర్థికే వేశాననే తృప్తి పొందడం కోసమే. దీనితో అక్రమాలు అరికట్టగల్గుతామన్నది కాదు. ఈ మధ్యకాలంలో ఎన్నికల్లో ఇవిఎంల ద్వారా ట్యాంపరింగ్ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యం కూడా ప్రతి గ్రామానికి చేరే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆధునిక టెక్నాలజీ ప్రాధాన్యత సంతరించుకుంటున్న భారత్‌లో సాంకేతిక రంగం మరింత అభివృద్ధి జరిగే దిశగా పాలకులు కృషి సల్పాలి.

- జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా తెలంగాణ నాయకుడు