ఫోకస్

విశ్వసనీయత కోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ప్రింటర్‌ను అమర్చడం, ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేశారో తెలియచేసే విధంగా రశీదు కనపడడం అనే ప్రక్రియ విశ్వసనీయత కోసమే. బ్యాలెట్ విధానం ఉన్నప్పుడు కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు పోలింగ్ బూత్‌ను ఆధీనంలోకి తెచ్చుకుని సిబ్బందిని బెదిరించి ఓట్లు వేసుకునేవారు. ఆ తర్వాత టెక్నాలజీ రావడంతో పోలింగ్ ప్రక్రియలో మార్పులు వచ్చాయి. మన రాష్ట్రంలో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. తాజాగా ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఇవిఎంలకు ప్రింటర్‌ను అమర్చారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారనే అనుమానం ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు వరుసగా ఓడిపోతుంటే, ఇవిఎంల విధానాన్ని తప్పుబట్టడం మొదలైంది. ఏమైనా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. తెలంగాణలో విపక్ష పార్టీలు ఇవిఎంల వ్యవస్థపై అనుమానం వ్యక్తం చేశాయి. వీరి సందేహాలను నివృత్తి చేసే విధంగా ఎన్నికల సంఘం ప్రింటర్లను అమర్చింది. దీనివల్ల ఓటరు తాను ఏ పార్టీకి ఓటు వేశారో వెంటనే తెలుస్తుంది. రశీదును చూసి తాను ఏ పార్టీకి ఓటు వేశానో, ఆ పార్టీకి ఓటుపడినట్లు ధ్రువపత్రం లభించినట్లవుతుంది. ఇది మంచి పరిణామమే. ప్రజల్లో కూడా నమ్మకం పెంచినట్లవుతుంది. బాగా అభివృద్ధి చెందిన సంపన్న పాశ్చాత్య దేశాల్లో బ్యాలెట్ పత్రం విధానం అమలులో ఉంది. అదే విధంగా రాజకీయ పార్టీల అనుమానాలకు తెరదించినట్లవుతుంది.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత