ఫోకస్

ప్రజల్లో చైతన్యం రావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటర్లకు ఓటు వేసినట్టు రసీదు ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రసీదు ఇవ్వడం వల్ల ఎవరికి ఓటు వేశారన్న విషయంలో రహస్యం పోయే అవకాశం ఉంటుంది. ఈ విధానంవల్ల సత్ఫలితాలు వస్తాయనుకోవడం లేదు. ఇదే సమయంలో మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు, ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజల్లో చైతన్యం రావాలి. ఈ విషయంలో జర్నలిస్టులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, మేధావులు, స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు తదితరులు బాధ్యత తీసుకుంటే మంచిది. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్య విధానంలో ఉన్నామని భావిస్తున్నాం. కాని నిజం ఆలోచిస్తే.. మన ‘ప్లూటోక్రసీ’లో ఉన్నామా అనిపిస్తోంది. ప్లూటోక్రసీ అంటే బాగా డబ్బున్న కొంతమంది సమాజాన్ని పరిపాలించడమే. ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతున్న వారంతా బాగా డబ్బున్న వారే కదా! మరి దీన్ని డెమోక్రసీ అనాలా? ప్లూటోక్రసీ అనాలా? డబ్బు ఖర్చు చేయలేని పేదలు ఎంతమంది చట్టసభల్లో ఉన్నారు? గతంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మంచి అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేసేవి. నీతి, న్యాయం, ధర్మం ఉన్నవారు చట్టసభలకు ఎక్కువమంది ఎన్నికయ్యేవారు. చట్టసభల్లో సంబంధిత అంశంపై సవివరంగా చర్చ జరిగేది. సభా కార్యక్రమాలు సజావుగా, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే లక్ష్యంగా కొనసాగేవి. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల వ్యయానికి ఒక పరిమితి ఉంది. అయతే పోటీ చేస్తున్న అభ్యర్థులు గుండెపై చేయి వేసుకుని ఈ వ్యయానికి లోబడే ఖర్చు చేస్తున్నాం అని చెప్పగలరా? అలా జరగడం లేదన్న విషయం ఎన్నికలు నిర్వహించే కమిషన్‌కు తెలుసు, అధికారులకు తెలుసు, ప్రజలకూ తెలుసు. అయితే పరిమితికి మించి ఖర్చు చేస్తున్నారంటూ ఎవరూ రుజువుచూపలేకపోవచ్చు. అంటే పేదలు ఓట్లు వేసే హక్కు మాత్రమే అనుభవిస్తున్నారు తప్ప, ఓట్లు వేయించుకునే హక్కు కోల్పోతున్నారని స్పష్టమవుతోంది. పైగా ఎన్నికల తర్వాత విపక్షపార్టీల సభ్యులు అనేకమంది వివిధ కారణాలను చూపిస్తూ అధికారం చేపట్టిన రాజకీయ పార్టీలోకి చేరిపోతున్నారు. పార్టీ మారితే సభ్యత్వం పోతుందని రాజ్యాంగం పదోషెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, ఇదే షెడ్యూల్‌లోని ఐదోక్లాజు పార్టీ మారే సభ్యులకు రక్షణను ఇస్తోంది. ఈ పరిస్థితిలో ప్రజల్లో చైతన్యం రావాలి.. స్వేచ్ఛగా నీతి, న్యాయం, ధర్మం వైపు నిలిచే అభ్యర్థులకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వారికి ఓటు వేయాలన్న ఆలోచన రావాలి.

-ఎస్.రామచంద్రరావు మాజీ అడ్వకేట్ జనరల్