ఫోకస్

ఫిరాయింపులపై సమగ్ర చట్టం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నాయకులు పార్టీలు మారడం మంచి సంప్రదాయం కాదు. తనను నమ్ముకున్న కార్యకర్తలు, ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ప్రజల విశ్వాసం కోల్పోతారు. కానీ తమ స్వార ప్రయోజనాల కోసమే పార్టీలను మారుతున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో పారదర్శకత లేదు. ఒక పార్టీ బ్యానర్‌పై గెలిచి మరో పార్టీలో చేరడం మానవతా విలువలను కోల్పోవడమే. అందుకే పార్టీ ఫిరాయింపులపై సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఉంది. పార్టీ విప్ జారీచేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప.. చట్టసభల్లో చర్చించి చట్టం తీసుకురావడం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలోనే తుడిచిపెట్టుకుపోయింది. టిడిపి ఎమ్మెల్యేలంతా టిఆర్‌ఎస్‌లో చేరిపోవడం అంటే.. టిఆర్‌ఎస్ చేపట్టిన ఆకర్ష్ పథకం విజయవంతమైనట్టే. తెలంగాణలో టిడిపి కనుమరుగైనప్పటికీ, ఆంధ్రాలో టిడిపికి ఆదరణ పెరుగుతుందా లేదా అక్కడ కూడా ఆకర్ష్ పథకం అమల్లో ఉందా? అనే మీమాంస వ్యక్తమవుతోంది. ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, మరో పార్టీలో చేర్చుకోవడం నైతిక విలువలు పోగొట్టుకోవడమే. చేరినవారు కూడా మానవత విలువలకు దూరమైనట్టే. రాయలసీమ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారంటే టిడిపి ఒకవైపే అభివృద్ధి చేస్తుందని అర్థం కాబోలు. వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధికోసమే అనడం సమంజసం కాదు. పార్టీ మారినంత మాత్రాన అభివృద్ధి మారదనే విషయాన్ని గ్రహించాలి. వైఎస్సార్‌సిపి కూడా నష్టపోతుందంటే పార్టీలో తగిన ప్రాతినిద్యం లేకపోవడం లేదా? ప్రలోభాలకు లొంగడమే. అందుకనే పార్టీల్లో పారదర్శకత ఉండాలి. పార్టీలు మారకుండా చట్టం తీసుకురావాలి. శాసనకర్తలే శాసనాలను ఉల్లంఘిస్తే.. సాధారణ కార్యకర్తల పరిస్థితేమిటి అన్న విషయం గుర్తుంచుకోవాలి. పార్టీ నాయకత్వం స్థిరంగా ఉంటే పార్టీలోని నాయకులు స్థిరంగా ఉంటారు. తటస్థ నాయకత్వం పార్టీని, పాలకవర్గాన్ని దెబ్బతీస్తుంది. అందుకే లోక్‌సత్తా పార్టీ ఎప్పుడూ అధికారం కోరుకోవడం లేదు. సమాజంలో మార్పును కోరుతోంది. సమాజ మార్పుకోసం పోరాడుతోంది. అవినీతి రహిత సమాజం రావాలని ఆకాంక్షిస్తోంది.

-జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి