ఫోకస్

ప్రజలే నిర్ణేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజల ఆశీర్వాదం ఓట్ల రూపంలో ఉండాలి. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. దీనికి కారణం ఆ పార్టీ తెలంగాణలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. టిడిపి ఇటీవల కాలంలో జాతీయ పార్టీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి హవాతో అధికారంలోకి వచ్చిన టిడిపి, తెలంగాణలో కనుమరుగైనట్లే. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో డిపాజిట్లు కోల్పోయింది. నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉపఎన్నికలో అదే పరిస్ధితి. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితమైంది. సైబరాబాద్ నిర్మాత తానేనని చెప్పుకుంటున్న చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారు. ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా టిడిపి చిత్తుగా ఓడిపోయింది. టిడిపికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి పార్టీని ఫిరాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టిడిపి అనైతిక విధానాలకు పాల్పడుతోంది. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలను టిడిపి చేర్చుకుంది. అనర్హత వేటు వేయాలని మా పార్టీ స్పీకర్‌ను కోరింది. ప్రజలు చాలా వివేచన కలిగినవారు. చంద్రబాబు పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, తెలంగాణలో పోయిన పరువును కాపాడుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో అనైతిక విధానాలకు పాల్పడుతూ వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాజ్యాంగం అంటే విశ్వాసం ఉంటే చంద్రబాబు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే టిడిపికి నిజంగా ప్రజాదరణ ఉందని ప్రజలు అంగీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టిడిపి శరవేగంగా పతనావస్థకు చేరుకుంటోంది. ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతోంది. ఆంధ్రాలో వచ్చే ఎన్నికల తర్వాత టిడిపి మరింత బలహీనపడుతుంది. జాతీయ పార్టీ అని గొప్పలు చెప్పుకున్న టిడిపి తెలంగాణలో జీరో అయింది. ఆంధ్రాలో ఉనికిని కోల్పోవడం ఖాయం. దీనికి చంద్రబాబు అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలే కారణమని చెప్పవచ్చు.

- విశే్వశ్వరరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ శాసనసభాపక్ష ఉపనేత