ఫోకస్

రాజ్యాంగంలో మార్పు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రాజకీయ పార్టీ నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధి ఎవరైనా పార్టీ మారడం అనేది నైతికత, రాజ్యాంగపరమైన అంశాలకు లోబడి ఉంటుంది. టిడిపి పరిస్థితి తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్‌లో మరోరకంగా ఉంది. తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికార టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికార టిడిపిలో చేరుతున్నారు. ఇక్కడ ఏం చెప్పుకోవాలి. తెలంగాణలో టిడిపి మంచిది కాదు, ఎపిలో మంచిది అనుకోవాలా? కాదు.. కాదు. పార్టీ ఎక్కడైనా ఒక్కటే. విపక్షంలో ఉండే పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఎదురుగా ఉండే ‘అధికారం’ కనిపిస్తోంది. తెలంగాణలో 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికార టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా పార్టీ మారిన వారిలో ఒకరు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీకి టిడిపి నుండి 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్నికల తర్వాత వీరిలో 2/3 వంతు మంది పార్టీ మారారు. రాజ్యాంగం పదోషెడ్యూల్ 5వ క్లాజు ప్రకారం ఒక పార్టీనుండి ఎన్నికైన మొత్తం సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది పార్టీ మారితే, వారి పదవికి ఎలాంటి ఢోకాలేదు. అయితే ఒకరో ఇద్దరో పార్టీ నుండి వెళ్లిపోతే మాత్రం వారి పదవికి గండం ఏర్పడుతుంది. అనర్హతవేటుకు గురికావల్సి ఉంటుంది. ఎపిలో ఇదే పరిస్థితి నెలకొంది. వైకాపాకు చెందిన ఎనిమిది మంది పార్టీ నుండి వెళ్లిపోయారు. వారు టిడిపిలో చేరినట్టు ప్రకటించుకున్నారు. ఎపిలో వైకాపా నుండి టిడిపిలో చేరిన వారి సంఖ్య 2/3 లేదు. అందువల్ల అలా పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది.
అనర్హత వేటు ఎవరు వేయాలి? ఈ అధికారం ఎవరికి ఉంది? అంటే అసెంబ్లీ స్పీకర్‌కే ఈ అధికారం రాజ్యాంగం కల్పించింది. స్పీకర్ సాధారణంగా అధికార పార్టీకి చెందినవారై ఉంటారు. విపక్షం నుండి అధికార పక్షానికి ఒక సభ్యుడు మారితే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాల్సింది స్పీకర్. స్పీకర్‌కు విచక్షణాధికారం ఉండటంతో స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే అర్థమవుతోంది. టర్మ్ పూర్తయ్యే వరకు కూడా ఇలా చర్యలు తీసుకోకపోయినా స్పీకర్‌ను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. గతంలో ఈ తరహా విధానం కొనసాగింది.
ఒక పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన వారు మరో పార్టీలోకి మారడానికి స్వేచ్ఛ ఉందా? అన్నది నైతికతకు సంబంధించింది. ప్రజలు ఒక పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే, ఆ ప్రతినిధి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పార్టీ మారితే ఎలా అన్నది ప్రధానాంశం. అయితే ఇక్కడ ప్రజలు కూడా ప్రలోభాలకు గురై ఓట్లు వేస్తున్నారన్న అపవాదు కూడా ఉంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ మారే సమయంలో ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఈ అంశంపై మేధావులు చర్చించాలి. చట్టసభల్లో కూడా విస్తృతంగా చర్చ జరగాలి. అవసరమైతే రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి.

- ఎస్. రామచంద్రరావు మాజీ అడ్వకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్.