ఫోకస్

అభ్యంతరకరమైన వ్యాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి ప్రాతినిధ్యం వహించే చట్టసభలో ఉన్న వ్యక్తి ఈ దేశ సారభౌమత్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. అసదుద్దీన్ ఓవైసీనే కాదు, ఈ దేశంలో ఏ పౌరుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేసినా తప్పే. రాజ్యాంగం ప్రతి పౌరునికి భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. అయితే ఈ స్వేచ్ఛ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కల్పించింది కాదు. రాజకీయ, సామాజికపరమైన అంశాలలో ఎవరి సిద్ధాంతాలను వారు వ్యక్తం చేయవచ్చు. ఇతరుల సిద్ధంతాలతో విభేదించవచ్చు. వాటి పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ విధంగా దుర్వినియోగం చేయడాన్ని హర్షించరు. సాధారణ పౌరుడు ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేసారంటే, తెలిసో, తెలియకనో, అజ్ఞానంతో చేసి ఉండవచ్చు అని భావించవచ్చు. కానీ ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి, ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యున్నతమైన చట్టసభకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తన్న విషయాన్ని మరిచిపోవద్దు. అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను యావత్తు ముస్లిం సమాజం కూడా తీవ్రంగా ఖండించింది, మండిపడింది కూడా. ఆయన వ్యాఖ్యలను ఒక మతానికి ముడిపెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇలా ఉండగా భారతమాత, తెలుగుతల్లి, తెలంగాణ తల్లి ఇవన్నీ మనకు మనం సృష్టించుకున్న కల్పితమైనవే కావచ్చు. కానీ దేశం పట్ల భక్తి, గౌరవం, అభిమానం చాటుకోవడానికి మాతృదేశానికి ప్రతీకగా భావిస్తున్నారు. భారత్‌మాత అంటే అదేదో ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి నినాదమన్న కోణం నుంచి మాత్రమే ఓవైసీ లాంటి వ్యక్తులు చూస్తున్నారు. అది ఒక రాజకీయ పార్టీ సిద్ధంతం కాదు, నినాదం కాదు, వాదన కానేకాదన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, ఎబివిపిలను సిద్ధంతపరంగా ఎవరైనా వ్యతిరేకించవచ్చు, విభేదించవచ్చు దాంట్లో తప్పులేదు. కానీ ఏకంగా దేశ సారభౌమత్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాష పట్ల గౌరవం, అభిమానం, భక్తి కలిగి ఉండటం ప్రతి పౌరుడి కర్తవ్యం. మాతృభూమినే ప్రేమించలేని వ్యక్తికి రాజ్యాంగం పట్ల విశ్వాసం ఎలా ఉంటుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన చట్టసభకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి దేశం పట్ల గౌరవం లేకపోతే ఎలా?.
-

ప్రొఫెసర్ రాజ్‌సిద్ధార్థ కాకతీయ వైద్య విశ్వవిద్యాలయం సామాజిక విశే్లషకులు