ఫోకస్

ఓ ప్రజాప్రతినిధికి ఇది తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాధ్యత కలిగిన ఓ పార్లమెంటు సభ్యుడు అనాల్సిన మాటలు కావవి. ఏదైనా ఒకటి మాట్లాడాలంటే ఎంపి స్థాయిలో ఉన్న వ్యక్తి నాలుగైదుసార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎవరి సెంటిమెంట్లు వారివి. ప్రజల సెంటిమెంట్‌ను కించపర్చడం ఎవరికీ మంచిది కాదు. భారత్ మాతాకీ జై అని మెడపై కత్తిపెట్టి అనమన్నా అనని చెప్పడం అసదుద్దీన్ ఒవైసీకి సరికాదు. అలా అనాల్సిన అవసరం లేనే లేదు. ఇలా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడ్డం వల్ల కోట్లాది మంది ముస్లిం మైనార్టీలపై అందరికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దేశ భక్తిపరులు కాదనే అపవాదు ఏర్పడుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అటువంటివి మరికొందరికి ఆపాదించే అవకాశం ఉంటుంది. ఉద్రేకాలను పెంచుకునే పరిస్థితి రాకూడదు. ఇలా అసదుద్దీన్ మాత్రమే కాదు మరో మతాన్ని, భావాలను కించపర్చేలా మాట్లాడ్డం ఎవరికీ అంత మంచిది కాదు. ముందు వెనుక ఆలోచించి మాట్లాడాలి. భారత మాతను అంతా గౌరవించాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్‌ను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. తప్పేమీ లేదు, పొరపాటున మాట్లాడి ఉండి ఉంటే ఉపసంహరించుకోవచ్చు. అలా చెప్పకుండా ఉండడం వల్ల భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ల వైఖరి ఈ దేశానికి మరింత ప్రమాదకరంగా మారింది. ఇతర మతాలను కించపర్చడం అలవాటైపోయింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఎప్పుడూ పాల్గొన్న దాఖలాలు లేవు. బ్రిటీషు వారికి గులాంగిరీ చేశారు తప్ప స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదు. అయినప్పటికీ మిగిలిన వారిని దేశ భక్తులు కాదని చెప్పడం, అలాంటి ప్రచారం చేయడం ఆర్‌ఎస్‌ఎస్‌కు తగదని చెప్పాలి. కాంగ్రెస్, వామపక్షాలే నిజమైన దేశభక్తి కలిగిన పార్టీలుగా గుర్తింపు ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ ఏ పోరాటంలో పాల్గొన్నదో ఒక్క ఉదాహరణ చెప్పమనండి. తాము తప్ప ఈ దేశంలో ఎవరూ దేశ భక్తులు కారనే అభిప్రాయం వ్యక్తం చేయడం ఆర్‌ఎస్‌ఎస్‌కు పరిపాటిగా మారింది. మిగిలిన వారిని కించపర్చడం ఆర్‌ఎస్‌ఎస్‌కు అలవాటైపోయింది. దేశంలో బిజెపి నేతృత్వంలో అధికారం చేపట్టడంతో ఆర్‌ఎస్‌ఎస్ మరింత దారి తప్పిందని చెప్పాలి. ఇప్పటికైనా తామే దేశ భక్తులు, మిగిలిన వారు కాదనే ప్రచారాన్ని విరమించుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావ ఫలితమే దేశ సమైక్యతకు ముప్పు కలిగే భారత్ మాతాకీ జై అననను అనేటు వంటి వ్యాఖ్యలు వస్తున్నట్లు భావించాలి.

- కె.రామకృష్ణ సిపిఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి