ఫోకస్

అశాంతి నివారణకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో అశాంతి నెలకొంది. చాలా రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్థి సంఘాలున్నాయి. ఈ రాజకీయ పార్టీలు తమ భావజాల వ్యాప్తికి, ఆధిపత్యానికి యూనివర్శిటీలను వేదికగా చేసుకున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో అశాంతి, ఆందోళన కలుగుతోంది. ఈ వ్యవహారాలన్నింటిపై కేంద్ర మానవవనరుల శాఖ తక్షణమే నిపుణులతో ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసి అధ్యయనం చేయాలి. అనంతరం ఈ కమిటీ ఇచ్చే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. యూనివర్శిటీల్లోకి రాజకీయ పార్టీలు అడుగుపెట్టరాదు. ఇటీవల కాలంలో సెంట్రల్ వర్శిటీలో రోహిత్ వేముల అనే పరిశోధన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ఈ ఘటనను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు వాడుకుంటున్నాయి. రాహుల్ గాంధీ నుంచి వామపక్ష పార్టీల నేతల వరకు ఈ వర్శిటీకి వెళ్లి అగ్నికి ఆజ్యం పోశాయి. చర్చ మంచిదే. వాదనలు ఉండాలి. కాని విద్యార్థి సంఘాల నేతలు చేయాల్సిన పనిని రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నవారు చేస్తే ఏమవుతుంది? అలాగే విద్యార్థి సంఘాలు కూడా ఒక స్థాయి వరకు ఉద్యమాలు చేయాలి. ఆ తర్వాత దాని పర్యవసానాలపై చర్చించే బాధ్యతను పార్లమెంటుకు, శాసనసభకు, ప్రజలకు వదిలివేయాలి. నిరంతరం కొన్ని అంశాలపై ఆందోళనల వల్ల అకడమిక్ రంగం దెబ్బతింటుంది. పరిశోధనలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో వివాదాలు చల్లారిందనుకుంటే మళ్లీ సెలవుపై వెళ్లిన విసి అప్పారావును విసిగా నియమించారు. తాజాగా ఆందోళనలు పునరావృతమయ్యాయి. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని హెచ్‌సియూలో శాంతి స్థాపనకు తగిన చర్యలు తీసుకోవాలి. గతంలో అనేక వర్శిటీల్లో అనేక గొడవలు ఘర్షణకు దారితీసిన సంఘటనలను చూశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఇబిసి విద్యార్థులకు చెల్లించే ఉపకారవేతనాలను పెంచాలి. వారికి అన్ని వౌలిక సదుపాయాలు కల్పించాలి. యూనివర్శిటీల్లో అధ్యాపక పెద్దలు కూడా రాజకీయాలు, కుల, మత దృక్పథాలకు అతీతంగా బోధన చేయాలి. రాజకీయ పార్టీలు మతం, కులం, ప్రాంతం, వర్గం ప్రాతిపదిక భావజాల వ్యాప్తికి యూనివర్శిటీలను ప్లాట్‌ఫారంగా ఎంపిక చేసుకుని కార్యకలాపాలను నిర్వహించే దుందుడుకు విధానాలకు స్వస్తి చెప్పాలి.

- ఎస్. సలాం అధ్యక్షుడు, వైకాపా విద్యార్థి సంఘం