ఫోకస్

దేశంలో అంతర్యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మేధావుల మధ్య, వారు నమ్ముతున్న సిద్ధాంతాలతో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇస్లామిస్టులు, మతం మార్చుకున్నవారు, కమ్యూనిస్టులు, సెక్యూలరిస్టులు వీరంతా ఒక వర్గంగా, భారతీయ తత్వం అచరించే దేశీయులు ఒక వర్గంగా ఉన్నారు. మేధావులు అంతర్యుద్ధానికి విశ్వవిద్యాలయాలను కేంద్రంగా చేసుకున్నారు. ఈ అంతర్యుద్ధానికి కమ్యూనిస్టులు మద్దతుగా నిలిచారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఆవిర్భవించి 90 ఏళ్లవుతుంది. ఇంతకాలం నుంచి ప్రజల సమస్యలపై పోరాడుతున్నామని చెప్పుకుంటున్నా కనీసం మూడు నాలుగు శాతానికి మించి ఓట్లు సాధించలేకపోతున్నారు. కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ అక్కడోసారి ఇక్కడోసారి అన్నట్టు అధికారంలోకి వస్తున్నారు. దేశంలో వారి ప్రభావం రోజు రోజుకు తగ్గడమే కానీ జనంలో వీరికి ఆదరణ లభించడం లేదు. దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనుకునే శక్తులు విశ్వవిద్యాలయాను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలు ప్రారంభించారు. వీరు రిసెర్చ్ స్కాలర్, పిజీ విద్యార్థులు అలాంటి వారిని తమ ఉచ్చులోకి లాగుతున్నారు. జెఎన్‌యూను కేంద్రంగా చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దేశంలో ఇదే విధంగా పలు యూనివర్సిటీలపై కనే్నశారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చినప్పుడు పాత తరం కాంగ్రెస్ నాయకులు ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆ సమయంలో కమ్యూనిస్టులు ఆమెకు అండగా నిలిచారు. దానికి ప్రతిఫలంగా ఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. దీనిలో మొదటినుంచి కమ్యూనిస్టులదే పెత్తనం. కమ్యూనిస్టు భావ జాల వ్యాప్తికి కృషి చేయడమే అక్కడి ప్రొఫెసర్ల ప్రధాన బాధ్యత. కమ్యూనిస్టు విద్యార్థులను యూనివర్సిటీలో చేర్పించారు. అక్కడి కోర్సులు ఉపాధికి ఉపయోగపడే వాటికన్నా దేశాన్ని చీల్చడానికి దోహదం చేసేవిగానే ఉంటాయి. మతం మార్చుకున్నవాళ్లు ఎస్సీ, ఎస్టీ కేసుల పేరుతో బెదిరిస్తుంటారు. అంబేద్కర్ కుల నిర్మాలన కోరుకున్నారు. కానీ అంబేద్కర్ పేరును ఉపయోగించుకుని అక్కడ ప్రొఫెసర్లు కులం పేరుతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతకాలంపాటు ఇలాంటి విశ్వవిద్యాలయాలను మూసేస్తే మంచిది. విశ్వవిద్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. విశ్వవిద్యాలయాలను దారిలో పెట్టే విధంగా విశ్వవిద్యాలయ ఉపకులపతులను ఎంపిక చేయాలి. విశ్వవిద్యాలయాల పరిస్థితిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటిని బాగు పరిచేందుకు, దేశాభివృద్ధికి దోహదం చేసే విధంగా తీర్చి దిద్దాలి

- త్రిపురనేని హనుమాన్ చౌదరి ప్రజ్ఞ్భారతి