ఫోకస్

పదవుల్ని కొంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాల్లో ఉపాధ్యక్షులు, అధ్యాపకుల పోస్టులు అమ్ముడుపోతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విద్యార్థులు, అధ్యాపకులు చీలిపోతున్నారు. చాలాచోట్ల వైస్‌చాన్సలర్ల పోస్టులను కొంతమంది అనర్హులైన అధ్యాపకులు లక్షలాది రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. విసి పదవి వచ్చిన తర్వాత అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా చేస్తే యూనివర్శిటీల్లో అశాంతి ఉండదా? మెరిట్‌కు పాతర వేసే విధంగా విసిలు వ్యవహరిస్తున్నారు. దీనికి మూలకారణం అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వాలు తమ చెప్పుచేతుల్లో వర్శిటీలు ఉండాలన్న దుష్ట సంకల్పమే. ఈ జాడ్యం రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలోని అన్ని యూనివర్శిటీలను పట్టిపీడిస్తోంది. ఇప్పుడున్న విద్యార్థులకు, అధ్యాపకులకు కట్టమంచి రామలింగారెడ్డి, పింగళి జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప వైస్‌చాన్సలర్లు తెలుసా? వైస్‌చాన్సలర్ పదవికి కట్టమంచి వనె్న తెచ్చారు. ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా ఉండగా విశాఖపట్నం వెళ్లారు. కట్టమంచి గారు నీలం సంజీవరెడ్డికి ఫోన్‌చేసి ‘రైల్వే స్టేషన్‌కు రమ్మంటారా?’ అని అడిగారు. ‘మీరు పెద్దలు, యూనివర్శిటీ వైస్‌చాన్సలర్... రైల్వే స్టేషన్‌కు రావడమేంటి? వద్దు’ అన్నారు. అదీ ఆనాటి పెద్దల మాట. ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యమంత్రులు, మంత్రులు, చివరకు ఎంపీలు, ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద విసిలు పడిగాపులు పడుతుంటారు. ఈ సన్నివేశాలను చూస్తే సిగ్గు వేస్తుంది. ఉస్మానియా వర్శిటీకి మంచి పేరు తెచ్చిన మహనీయుల్లో పింగళి జగన్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ రామిరెడ్డి ఉన్నారు. ఇలాంటి గొప్పతరం విసిలు ఇప్పుడెక్కడున్నారు? ఈ రోజు ఏ వర్శిటీకి వెళ్లినా ఏడుపు వస్తుంది. దుఃఖం పొంగి వస్తుంది. విద్యార్థులు, అధ్యాపకులు అందరూ ఒకేచోట కూర్చుని విందులు చేసుకుంటున్న దృశ్యాలు కనపడుతున్నాయి. ఈ సమాచారం వింటే బాధ వస్తుంది. నాగార్జున వర్శిటీలో ఆ మధ్య గొడవేమిటి? విసిల నియామకాన్ని ప్రక్షాళన చేయాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతిభావంతులైన వారిని, అనుభవం ఉన్నవారిని విసిలుగా నియమించాలి. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో అశాంతికి కారణమేంటి? సద్దుమణిగిన వర్శిటీలో మళ్లీ కల్లోలమెందుకు? భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, విలువలు, జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలు ఉన్న గొప్పవారిని విసిలుగా నియమించాలి. దీనికోసం రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు వేయాలి. ఒక మంచి ప్రయత్నం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి కృషి చేయాలి.

- విశే్వశ్వరరెడ్డి, వైకాపా శాసనసభాపక్ష ఉపనేత