ఫోకస్

ఉన్నత విద్యకు ‘చంద్ర’గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత విద్యపట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సమాజాభివృద్ధిలో కీలకభూమిక పోషించాల్సిన విద్యారంగాన్ని అభివృద్ధి పథంవైపు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలోని విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్-్ఛన్సలర్లు లేరు. పాలక మండళ్లను ఏర్పాటు చేయలేదు. బోధనా సిబ్బంది అవసరమైన సంఖ్యలో లేరు. అవసరమైన మేరకు భవన సౌకర్యాలు, వౌలిక సదుపాయాలు లేవు. దీంతో ఉన్నత విద్యారంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ స్థాయిలో కాదు..జాతీయ స్థాయిలో కూడా ఏ రాష్ట్రంతో పోటీపడలేని దుస్థితిలో ఉన్నత విద్యారంగం కునారిల్లుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రోల్స్ ప్రకారం 1260 మంది రెగ్యులర్ టీచర్లు (ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు) పనిచేయాల్సి ఉండగా, 590 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అలాగే వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం, నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం, కరీంనగర్‌లోని శాతవాహనా విశ్వవిద్యాలయం తదితర విద్యాలయాల్లో సుమారు 50 శాతం వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 70 డిగ్రీ కాలేజీలుండగా, వీటిలో బోధనా సిబ్బంది సగభాగం కూడా లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఏర్పాటైన డిగ్రీ కాలేజీల్లో కూడా లెక్చరర్లు లేకపోవడంతోపాటు సొంత భవనాలు లేకపోవడంతో చాలీచాలని గదులతో కూడిన భవనాల్లో వీటిని నడపాల్సి వస్తోంది. ఎయిడెడ్ కాలేజీల్లో ఎవరైనా పదవీ విరణమ చేస్తే, ఖాళీ అయిన పోస్టులను భర్తీచేయడం లేదు.ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉంది. జెఎన్‌టియు స్వయంగా ఏర్పాటు చేసిన మంథని (కరీంనగర్), సుల్తాన్‌పూర్ (మెదక్), జగిత్యాల (కరీంనగర్) తదితర ఇంజనీరింగ్ కాలేజీల్లో యాభైశాతం టీచింగ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పేరుకే లెక్చరర్ పోస్టులు భర్తీ అయినట్టు ఉన్నప్పటికీ, వాస్తవంగా పనిచేయడం లేదు.
ఇలా ఉండగా పేద విద్యార్థులకు 2014-15 సంవత్సరానికి సంబంధించిన ఫీజు నేటికీ రీయింబర్స్ చేయలేదు. 2015-16 సంవత్సరానికి ప్రాసెస్ ఇంకా మొదలుపెట్టలేదు. తెలంగాణలో ఉన్నత విద్యారంగం పరిస్థితి మెరుగుకావడం ఎలా ఉన్నప్పటికీ, మరింత దిగజారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత విద్యారంగం, మరీ ముఖ్యంగా ఉన్నత విద్యారంగం పటిష్టమవుతుందని అంతా భావించారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ పరిస్థితిలో విద్యారంగంపై వెంటనే ఉన్నతస్థాయిలో సమీక్షించాలి. అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారినే వైస్-్ఛన్సలర్లుగా నియమించాలి. యూనివర్సిటీ లన్నింటికీ స్వేచ్ఛ కలిగిన పాలక మండళ్లను ఏర్పాటు చేయాలి. కొత్త భవనాలతోపాటు కాలేజీల్లో వౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలి.

-ప్రొఫెసర్ బి.సత్యనారాయణ అధ్యక్షుడు, తెలంగాణ విశ్వవిద్యాలయాల టీచర్ల సమాఖ్య