ఫోకస్

మంచి వీసీల కోసం రూల్స్ మార్చక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనివర్శిటీల పరువు ఎలా పోతోందో... వైస్ చాన్సలర్లు చేస్తున్న అక్రమాలు, అవినీతి కార్యక్రమాల గురించి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుగారు శాసనసభలో చెప్పారు. వారు చెప్పింది అక్షరాల నిజం...ఇపుడు సిఎం గారు చెబుతున్న విసిలను ఈయన నియమించలేదు, గత ప్రభుత్వాలు నియమించిన వారు. మనకు కావల్సింది ఇదే...తప్పు ఎక్కడ జరిగిందో సిఎం గారు గుర్తించారు, ఇక మనకు మంచి విసిలు వస్తారనే నమ్మకం కలుగుతోంది. గతంలో జరిగిన పొరపాటు ఇక జరిగే అవకాశం లేదన్నది సిఎం మాటల్లో మనకు అర్ధమవుతోంది.
వైస్ చాన్సలర్లను నియమించేది సెర్చి కమిటీలే. సెర్చికమిటీల్లో సభ్యులను నియమించేది ఎవరు? ప్రభుత్వం కాదా...ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒక సభ్యుని పేరును సూచిస్తుంది. ఎగ్జిక్యూటివ్ సభ్యుడ్ని నియమించేది ఎవరు? ప్రభుత్వం కాదా...అంటే సెర్చికమిటీల్లో ఒక సభ్యుడ్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇస్తే మరో సభ్యుడిగా ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. ఇక మూడో సభ్యుడు యుజిసి నామినీ ఉంటారు. ఆయనకు ఇక్కడ ఎవరి పేరు చెప్పినా తెలిసే అవకాశం లేనే లేదు. కొన్ని సందర్భాల్లో యుజిసి నామినీ సైతం రాష్ట్రప్రభుత్వ కనుసన్నలలో ఉన్నవారే వస్తుంటారు. ఇదంతా చూస్తే ఒకటి మాత్రం సుస్పష్టం. సెర్చికమిటీ నియామకం సక్రమంగా జరగనంతకాలం విసిల నియామకాలు సక్రమంగా జరిగేది లేదు. అసెంబ్లీలో విసిలను ప్రభుత్వమే నియమించే విషయాన్ని అదేదో కొత్త ప్రస్తావనగా మాట్లాడుతున్నారు. చర్చించుకుంటున్నారు, కాని అందులో కొత్తేమీ లేదు, ఇది తుదకు వచ్చి సిఎం మంచితనంపై ఆధారపడే విషయం. అతడు మంచివాడైతే మంచి విసిలు వస్తారు, కాకపోతే రారు. ఎవరెన్ని మాట్లాడినా తక్కినవన్నీ ఒకెత్తు, అదొకెత్తు. ఒక కాలంలో మంచి విసిలు వచ్చేవారు, ఎలా వచ్చారు? అపుడింకా సెర్చికమిటీలు వగైరా లేవు. ఆనాటి సిఎంల మంచితనం వల్ల మంచివాళ్లొచ్చారు. ప్రజలు మంచి వారిని ఎన్నుకుంటే మంచి ప్రభుత్వం వస్తుంది. లేకపోతే చెడ్డప్రభుత్వం వస్తుంది. యూనివర్శిటీలు కూడా మంచి వారిని ఎన్నుకుంటే మంచిగా ఉంటాయి, లేకపోతే దిగజారిపోతాయి.
ఎంత మంచివారిని నియమిస్తే ఏమిటి? ఆయా యూనివర్శిటీలకు చెడ్డ ఇసిలను ఇస్తే, వారికి ఇవ్వాల్సిన నిధుల కోసం వారు ప్రభుత్వంపై దిగజారిపోయి పైరవీలు చేయాల్సి వస్తే, వాటిలోని నియామకాల కోసం అడుగడుగునా ప్రభుత్వ పర్మిషన్లు కావల్సివస్తే ఆ పర్మిషన్లు సంవత్సరాలు గడచినా, రాక టెంపరరీ, కంటింజెన్సీ నియామకాల పేరిట విసిలు ఇష్టమైన వారిని ఇష్టమైనంత మందిని నియమించుకునేందుకు ఆస్కారం కల్పించి అలాంటి నియామకాల్లో ప్రభుత్వం సైతం భాగస్వామ్యమైతై వారి వాటాలు వారు కోరితే దానికి విసిలు ఎలా బాధ్యులవుతారు...కనుక ఎన్ని మాట్లాడినా తుదకు లీడర్లను బట్టి నియామకాలు ఉంటాయి. నియామకాల ఆధారంగానే నీతి, రీతి ఉంటుంది. సిఎం గారు హైకోర్టు న్యాయమూర్తులను, ఐఎఎస్‌లను, ఐపిఎస్‌లను నియమిస్తామంటున్నారు, వారిలో కూడా మంచి వారు, చెడ్డవారు లేరా..? అన్ని రంగాల్లో మంచివారుంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. మంచివారినే విసిలుగా నియమించదలచుకుంటే విద్యారంగంలోనే వారు దొరకకపోరు. వారిని వదిలి వేరే రంగాల వారిని తీసుకోదల్చుకుంటే తీసుకోవచ్చు, అది ఇంతకుపూర్వం కూడా జరిగింది. మహా అయితే ఇపుడు మాకు మంచివారు తగినంత మంది లభించనందువల్ల అవుట్‌సైడ్ ది అడ్మినిస్ట్రేషన్ వేసుకోవడానికి అంగీకారం కోరవచ్చు. దానికి తగ్గట్టు యుజిసి నియమనిబంధనలు మార్చుకోవచ్చు. అవుట్‌సైడరైనా, ఇన్‌సైడరైనా ప్రతిభ, నీతి రెండింటి ఆధారంగానే నియామకాలు చేస్తే ఎవరికీ ఏ ఆక్షేపణ ఉండదు. విశ్వవిద్యాలయాల తలుపులు తెరచి ఉండాలే కాని, కొందరికే అని మూసేయకూడదు. వైస్ చాన్సలర్ల కన్నా చాన్సలర్ల నియామకాల్లో ప్రభుత్వం వయస్సు నిబంధనను కాస్త సడలించి రిటైర్డ్ అయిన ప్రతిభావంతులతో , నీతిమంతులతో ఆ నియామకాలు చేయాలి. వారి అంగీకారాలతో విసిలను నియమిస్తే యూనివర్శిటీలు బాగుపడతాయి. అలాగే ఇసి మెంబర్ల నియామకాలు కూడా పద్ధతి ప్రకారం జరగాలి. ఇవన్నీ శాసనాలతో పాటు వాటిని అమలుపరిచే విధివిధానాలపైనే ఆధారపడి ఉంటుంది. రూల్స్ కన్నా రూల్ ఆఫ్ లా అంటే ఆ రూల్స్ నడుస్తున్నాయా లేదా పాటించబడుతున్నాయా లేదా అనేదిముఖ్యం కదా మరి. మెచ్యూర్డు డెముక్రసీలో అవి పాటించబడతాయి. పాటించినట్టు తగిన చర్యలు తీసుకోబడతాయి. వాటికీ తక్కిన వాటికీ రూల్ ఆఫ్ లా అటు పరిపాలకులు, ఇటు ప్రజలు పాటిస్తున్నారా లేదా అనే దానిలోనే ఉంటుంది అసలు సిసలు విభిన్నత

- డాక్టర్ కొండలరావు వెల్చాల మాజీ సంచాలకుడు, ఉన్నత విద్యాశాఖ