ఫోకస్

విద్యాలయాల్లో ఇలాంటివి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ ఎందుకు? అందులో 120 కోట్ల మంది భారతీయులు పూజించే గోమాతను వధించి బిరియానీ చేసి తినేందుకు పండగ అవసరమా? ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన రెచ్చగొట్టే చర్యగా భావిస్తున్నాం. ఆహారమనేది వ్యక్తిగతమైనదే. కాని ప్రజల్లో చీలికలు తెచ్చే విధంగా, సమాజంలో అశాంతిని పెంచే విధంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహించే ప్రయత్నం చేయడం అసంబద్ధం. విశ్వవిద్యాలయాల్లో ఇంకా వివిధ కోర్సులపై, చదివే విధానంపై, ఉద్యోగ నియామకాలు, ప్రాంగణ ఇంటర్వ్యూలపై ఫెస్టివల్స్ నిర్వహిస్తే బాగుంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రజల సెంటిమెంట్లను గాయపరిచే ఫెస్టివల్స్‌ను విశ్వవిద్యాలయాల్లో నిర్వహించరు. విశ్వవిద్యాలయాల్లో మత, వర్గం ప్రాతిపదికన విద్యార్థుల్లో చీలికలు తెచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భారీఎత్తున మహా చండీయాగాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణలో ఆధ్మాతిక సిరి వెల్లివిరిస్తున్న సమయంలో, ఒక మహాయాగం ఈ నెలలో జరగబోతుండగా, గోమాతను బలి ఇచ్చి బీఫ్ ఫెస్టివల్ జరుపుకోవాలని కొంతమంది విద్యార్ధులు నిర్ణయించడం సహేతుకం కాదు. ఈ తరహా ఉత్సవాలను విశ్వవిద్యాలయాల్లో, మరెక్కడా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. యూనివర్శిటీలకు విద్యార్థులు వెళ్లేది చదువుకునేందుకు అనే విషయాన్ని మర్చిపోయి, ఫుడ్ ఫెస్టివల్స్ పేరిట ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు. ఆహారం వ్యక్తిగత అలవాటు కావచ్చు. దానిని బహిరంగపర్చడం మంచి పద్ధతి కాదు. వ్యక్తిగత ఆహార అలవాట్లను వివాదం చేసుకుని, సమాజంలో కలహాలకు పునాది వేయడం విద్యార్థులకు ఏమాత్రం మంచిది కాదు. విద్యార్ధులు వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడే సెమినార్లను, వర్క్‌షాపులను వర్శిటీల్లో నిర్వహించాలి. వేలాది మంది విద్యార్థులు, యువకుల బలిదానాల పునాదులపై తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నాం. ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరువలేనిది. అందరూ కష్టపడి తెలంగాణ నవ నిర్మాణానికి శ్రమిద్దాం. అంతేకాని బీఫ్ ఫెస్టివల్స్ పేరిట తెలంగాణ సమాజాన్ని చిన్నాభిన్నం చేసే చర్యలు తగవు.

- కె శివకుమార్ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి