ఫోకస్

కోర్టుల దాకా ఎందుకు వెళ్లింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ సంప్రదాయం హిందూ మతానికి ఉంది. ఆగమాలలో హిందూత్వానిదే ప్రథమ ప్రాధాన్యం. హిందూ దేవాలయాల్లో నిత్య ధూప, దీప, నైవేధ్యాల సమర్పణ, ఉత్సవాల నిర్వహణ ఒక విశేషాంశం. ప్రత్యేకించి కొన్ని దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. హిందూ సమాజంలో మహిళకు ఎప్పుడూ అగ్రస్థానమే ఉంది. దేవాలయాల్లో మహిళల ప్రవేశం అన్న అంశం పూర్తిగా సంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లకు సంబంధించినదే. దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం నిషేధం అన్నది ఆగమాలకు సంబంధం లేని విషయం. తరతరాల కిందట మన పూర్వీకులు కొన్ని ఆచారాలు, కట్టుబాట్లను తీర్మానించారు. ప్రస్తుత కాల, మాన పరిస్థితులకు అనుగుణంగా మన ఆచారాలు, సంప్రదాయాలను మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పు ఆగమాలకు విరుద్ధం కారాదు. ప్రకృతి సహజసిద్ధంగా మహిళల్లో చోటుచేసుకునే నెలసరి, గర్భధారణ వంటి సందర్భాల్లో దైవ దర్శనం ఆమోదయోగ్యం కాదు. దీన్ని అనుసరించే అప్పటి ఆగమ విధానాలకు అనుగుణంగా, ఆచార, సంప్రదాయాల మేరకు మహిళలను ఆలయాల్లోకి అనుమతించలేదు. ఒకప్పుడు ధర్మాన్ని అనుసరించి మానవాళి మనుగడ సాగేది. ప్రసుతకాలంలో ధర్మాచరణస్థానే చట్టం అనే నిబంధనావళిని మనం రూపొందించుకున్నాం. ప్రస్తుతం మనమంతా చట్టప్రకారమే నడుచుకుంటున్నాం. మనం రూపొందించుకున్న చట్టప్రకారం మనం నడవాల్సి ఉంది. చట్టప్రకారం మనం మనుగడ సాగించే సందర్భాల్లో అనివార్యమైతే న్యాయస్థానాల జోక్యం తప్పనిసరి. హిందూ ఆలయాల్లో మహిళలకు ప్రవేశం అన్న అంశం ఇంతగా ప్రచారంలోకి రావడం వెనుక ఒక విధంగా కుట్రే దాగుందేమో. దేవాలయాల్లోకి మహిళల ప్రవేశం అన్న అంశం అసలు కోర్టు పరిధిలోకి ఎందుకు వెళ్లిందన్న అంశాన్ని పరిశీలించాలి. ఇది దురాలోచనే. హిందూమతాన్ని బజారుకీడ్చాలన్న స్వార్థపరుల కోణంలో చూస్తే అసలు న్యాయస్థానం జోక్యం వరకూ మనం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయం పరిశీలించాలి. ఇది ఒక రకంగా హిందూమతానికి, ఆచార, సంప్రదాయాలకు పెనుసవాలుగానే భావించాలి. ఈ తరుణంలో ఆచారాన్ని పక్కనపెట్టి ఆగమాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని మతాల్లో మహిళకు కనీస ప్రాధాన్యత లేని విషయాన్ని ఎందుకు గుర్తించడంలేదు. వారి స్వేచ్ఛాజీవితాన్ని హరిస్తున్నప్పటికీ ఎవరూ న్యాయస్థానాల గడపతొక్కడం లేదు. ఒక్క హిందూ దేవాలయాల్లో మహిళల ప్రవేశం అన్న అంశంపైనే దృష్టి కేంద్రీకరించడం బాధాకరం. ఈ విషయాన్ని హిందుత్వాన్ని ఆచరించే వారంతా అర్థం చేసుకోవాలి. హిందుత్వంపై జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవాలి.

- స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీ శారదాపీఠం, పెందుర్తి, విశాఖపట్నం జిల్లా